Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

New feature for Google Pay users .. NFC payments can now be made ..


 Google Pay..యూజర్లకు కొత్త ఫీచర్ .. ఇకపై NFC పేమెంట్లు చేయొచ్చు ..
New feature for Google Pay users .. NFC payments can now be made ..
సాఫ్ట్‌వేర్ సంస్థ Google భారత్‌లోని తన Google Pay యూజర్లకు సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తుంది. ఇకపై Google Pay యూజర్లు తమ ఎన్ఎఫ్‌సీ ఆధారిత డెబిట్‌, క్రెడిట్ కార్డులను Google Payలో యాడ్ చేసి వాటి ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటికే ఏడాది నుంచి Google ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండా Google Pay ద్వారానే వాటితో చెల్లింపులు చేయవచ్చు.

Google Pay లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే…

* ఫోన్ లోని Google Pay యాప్‌ను ఓపెన్ చేయాలి.
అందులో సెట్టింగ్స్ లో ఉండే పేమెంట్ మెథడ్స్ లోకి వెళ్లి యాడ్ కార్డ్‌ను ప్రెస్ చేయాలి.

* కార్డు నంబర్‌, ఎక్స్‌పైరీ తేదీ, సీవీవీ నంబర్‌, పేరు, బిల్లింగ్ అడ్రస్ ఎంటర్ చేయాలి.

* సేవ్ బటన్‌పై ప్రెస్ చేయాలి.

* టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేయాలి.

* కార్డు బ్యాంకును Google  కాంటాక్ట్ చేసి కార్డు మీదో, కాదో వెరిఫై చేస్తుంది. అందుకు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్‌ను ఎంచుకోవచ్చు.

* ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి.

* లిస్ట్‌లో ఉండే కార్డును పేమెంట్ మెథడ్‌గా ఎంచుకుని యాక్టివేట్ అనే బటన్‌పై ప్రెస్ చేయాలి.

* Google Pay అకౌంట్ వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మళ్లీ ఓటీపీ కన్ఫాం చేయాలి. దీంతో యూజర్ యాడ్ చేసే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు Google Pay అకౌంట్‌లో యాడ్ అవుతుంది.

తరువాత ఆ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన పనిలేకుండానే Google Pay ద్వారా ఎక్కడైనా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇందుకు గాను ఫోన్‌లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్ ఉండాలి. ప్రస్తుతం చాలా వరకు ఫోన్లలో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఇబ్బంది ఉండదు. ఇక బిల్లు చెల్లించే మెషిన్‌కు ఎన్ఎఫ్‌సీ సదుపాయం ఉండాలి. లేదా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు. ఇలా Google Pay లో ఎన్ఎఫ్‌సీ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశను ముగించుకున్నందున త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Thanks for reading New feature for Google Pay users .. NFC payments can now be made ..

No comments:

Post a Comment