Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

Will spaceships burn like meteors? and Why do the sun and moon appear larger near the sea than in normal places?


ఎందుకు? ఏమిటి? ఎలా?

Q:Will spaceships burn like meteors? 
అంతరిక్ష నౌకలు ఉల్కల్లా మండిపోవేం?

జవాబు:రోదసిలోని శూన్యం గుండా ఉల్కలు (meteors) భూ వాతావరణంలోకి గంటకు వేలకొద్దీ కిలోమీటర్ల వేగంతో ప్రవేశిస్తాయి. అలా వచ్చే ఉల్క వాతావరణాన్ని ఢీకొనగానే అక్కడున్న గాలి అత్యంత ఒత్తిడికి గురవుతుంది. అందువల్ల అక్కడి గాలి ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది. ఆ ఉష్ణం వల్ల అతిగా వేడెక్కిన ఉల్క వెలుగులు చిమ్ముతూ పూర్తిగా ఏమీ మిగలకుండా మండిపోతుంది. అలా వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క ఉష్ణోగ్రత దాదాపు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు చేరుకుంటుంది. 

అలాగే అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు కూడా ఇంతటి ఘర్షణ ఏర్పడుతుంది. అయితే అది ఉల్కలా మండిపోకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. అంతరిక్ష నౌక ఉపరితలంపై సిలికా, సిలికాన్‌డై ఆక్సైడ్‌ పూతపూసిన పలకలను అమరుస్తారు. ఈ పలకలు 93 శాతం వరకు సచ్చిద్రత (porosity) అంటే అతి సన్నని రంధ్రాలను కలిగి ఉంటాయి. అందువల్ల అంతరిక్ష నౌక వాతావరణంలోకి ప్రవేశించినపుడు జనించే అత్యధిక ఉష్ణశక్తి, ఆ పలకల్లో ఒక భాగం నుంచి మరో భాగానికి ప్రవహించదు. సిలికాన్‌ ఉష్ణ వ్యాకోచ ధర్మం (thermal expansion), ఉష్ణ వాహకత్వం (thermal conduction) అతి తక్కువ. అందువల్ల సిలికా పలకలు సంపూర్ణ అధమ వాహకాలు(perfect insulators) గా పనిచేస్తాయి. 

సిలికా పలక అంచులను రెండు చేతులతో పట్టుకుని దాని మధ్య ప్రదేశాన్ని ఎర్రని వెలుగు వచ్చే వరకు వేడి చేసినా, ఆ ఉష్ణం పలకను పట్టుకున్న వ్యక్తి చేతులకు సోకదు. అంటే ఆ ఉష్ణశక్తి పలకల అంచులకు చేరుకోదన్నమాట. వీటివల్లనే అంతరిక్ష నౌకలు క్షేమంగా భూమి పైకి చేరుకోగలుగుతాయి. 
       

 Q: Why do the sun and moon appear larger near the sea than in normal places?
సాధారణ ప్రదేశాల్లో కన్నా సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తారు? 

జవాబు:సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయ సమయాల్లో సముద్ర ప్రాంతాల్లోనే కాకుండా.. భూమ్యాకాశాలు కలిసినట్లుగా కనిపించే చోట సూర్యుడు, చంద్రుడు పెద్దగా అగుపిస్తారు. మిట్టమధ్యాహ్నం కన్నా ఉదయం, సాయంత్రాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడానికి మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్) కారణమని పరిశోధనల్లో తేలింది. నిజానికి సూర్య, చంద్రుల పరిమాణాల్లో పెద్దగా తేడాలు ఉండవు. సముద్రతీరాల్లో, ఉదయం, సాయంత్రం వేళల్లో తీసిన.. అలాగే వేరే ప్రాంతాల్లో, వేరే సమయాల్లో తీసిన చిత్రాల్లో సూర్య, చంద్రుల పరిమాణాలు దాదాపు ఒకేలా ఉంటాయి.
      

Thanks for reading Will spaceships burn like meteors? and Why do the sun and moon appear larger near the sea than in normal places?

No comments:

Post a Comment