Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, September 9, 2020

SBI ATM: Debit in the account but no money in the ATM? Be compliant like this


SBI ATM : అకౌంట్లో డెబిట్ అయినా ఏటీఎంలో డబ్బులు రాలేదా ? ఇలా కంప్లైంట్ చేయండి.

   ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినప్పుడు అకౌంట్‌లో డెబిట్ అవుతాయి కానీ ఏటీఎం నుంచి డబ్బులు రావు. దాదాపు అన్ని ఏటీఎంలో కస్టమర్లకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మెషీన్‌లో నుంచి డబ్బులు రావు కానీ... అకౌంట్‌లో మాత్రం డెబిట్ అవుతాయి. ఆ సమయంలో కస్టమర్లు కంగారుపడటం సహజమే. డబ్బులు ఏమయ్యాయో, మళ్లీ వస్తాయో రావోనన్న టెన్షన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకట్రెండు రోజుల్లోనే డబ్బులు వెనక్కి వస్తాయి. మళ్లీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఇంకొన్ని సందర్భాల్లో అయితే కస్టమర్లు బ్యాంకులో కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులు ఇలాంటి ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్‌పై కంప్లైంట్స్ తీసుకొని సమస్యల్ని పరిష్కరిస్తుంటాయి

మీకు ఒకట్రెండు రోజుల్లో డబ్బులు వెనక్కిరాకపోతే కంప్లైంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వచ్చిన స్లిప్‌ను భద్రంగా దాచుకోవడం మంచిది. మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇలాంటి సమస్య ఎదురైతే ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.


   మీకు ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ సమస్య వస్తే ముందుగా బ్యాంకు వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. మీ వివరాలతో లాగిన్ అవండి. ఆ తర్వాత సీఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేయండి. అందులో కస్టమర్ టైప్, అకౌంట్ నెంబర్, పేరు, బ్రాంచ్ కోడ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, కంప్లైంట్ కేటగిరీ, ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్, కంప్లైంట్ వివరాలను ఎంటర్ చేయండి. ఓసారి వివరాలన్నీ సరిచూసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పన క్లిక్ చేయండి. మీ కంప్లైంట్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా కంప్లైంట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో మీ కంప్లైంట్‌ను ట్రాక్ చేయొచ్చు. ఏడు రోజుల్లోపే మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీకు మెసేజ్ కూడా వస్తుంది.


మీరు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీరు చెప్పే వివరాలన్నీ సరిచూసుకొని మీ డబ్బుల్ని క్రెడిట్ చేస్తారు. లేదా దగ్గర్లోని బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. అయినా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్ మేనేజర్‌ని కలిసి ఫిర్యాదు చేయొచ్చు. వీళ్లెవరూ మీ సమస్యను పట్టించుకోకపోయినా, పరిష్కరించకపోయినా మీరు అంబుడ్స్‌మన్‌కు రాతపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయొచ్చు.

Thanks for reading SBI ATM: Debit in the account but no money in the ATM? Be compliant like this

No comments:

Post a Comment