Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 19, 2020

SBI Loan: An excellent opportunity from SBI for those who are unable to pay EMI


SBI Loan : ఈఎంఐ కట్టలేకపోతున్నవారికి ఎస్బీఐ నుంచి అద్భుతమైన అవకాశం
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నుంచి ఏదైనా లోన్ తీసుకున్నారా? ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీకు ఎస్‌బీఐ అద్భుతమైన అవకాశం ఇస్తోంది. లోన్ రీస్ట్రక్చరింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు రీటైల్ లోన్ కస్టమర్లకు అవకాశం కల్పిస్తోంది.


 లోన్ కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లోనే రుణ పునర్నిర్మాణం కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇందుకోసం ఎస్‌బీఐ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఇప్పటికే రీటైల్ రుణగ్రహీతలకు రెండు సార్లు మొత్తం ఆరు నెలలు మారటోరియం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోన్ రీస్ట్రక్చరింగ్‌ ద్వారా ఆరు నెలల నుంచి 2 ఏళ్ల వరకు అదనంగా మారటోరియం పొందొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ సూచిస్తోంది.


 మీకు ఎస్‌బీఐలో ఉన్న మీ లోన్‌ను రీస్ట్రక్చర్ చేయాలనుకుంటే https://sbi.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Relief to Retail Borrowers from Covid 19 Stress పేరుతో బ్యానర్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కస్టమర్లు నేరుగా
https://digivoucher.sbi.co.in/EMIRestruct/EMI_CustomerLogin.jsp లింక్ కూడా ఓపెన్ చేయొచ్చు.

ఆ తర్వాత Loan Account Number ఎంటర్ చేసి Generate OTP పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఎలిజిబిలిటీ తెలుస్తుంది. కస్టమర్లు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి లోన్ రీస్ట్రక్చరింగ్‌ ఎంచుకోవచ్చు. ఎంఎస్ఎంఈ కస్టమర్లు మాత్రం సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి రుణ పునర్నిర్మాణానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


 కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోన్ కస్టమర్లు రుణ పునర్నిర్మాణ అవకాశాన్ని ఇస్తోంది ఎస్‌బీఐ. 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఆగస్టులో వేతనం లేదా ఆదాయం తగ్గినవారికి మాత్రమే ఈ అవకాశం. అంటే లాక్‌డౌన్ కాలంలో వేతనం తగ్గినా, పూర్తిగా ఆగిపోయినా, ఉద్యోగం కోల్పోయినా, వ్యాపారాలు మూతపడ్డా లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అప్లై చేయొచ్చు.


  హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రీస్ట్రక్చర్ చేస్తుంది ఎస్‌బీఐ. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మారటోరియం కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. 2020 మార్చి 1 తర్వాత రుణాలు తీసుకున్నవారికి ఈ అవకాశం లేదు. ఇక ఎప్పట్లాగే వేతనం, ఆదాయం వస్తున్నవారు కూడా రుణాలను పునర్నిర్మించుకోలేరు. లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 24 చివరి తేదీ.

 ఎస్‌బీఐలో మొత్తం 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. జూన్ చివరి నాటికి లోన్ బుక్‌లో 10 శాతం మారటోరియంలో ఉంది. అదే మేలో లెక్కలు చూస్తే మారటోరియంలో 21.8 శాతం రుణాలు ఉండటం విశేషం. సుమారు 90 లక్షల మంది రీటైల్ కస్టమర్లు రూ.6.5 కోట్ల మారటోరియం ఎంచుకున్నారు. బ్యాంకులో రీటైల్ లోన్ రూ.7.5 లక్షల కోట్లు ఉంటే, అందులో రూ.4.55 లక్షల కోట్లు హోమ్ లోన్స్ కాగా రూ.1.45 లక్షల కోట్లు పర్సనల్ లోన్స్. ఎస్‌బీఐలో సుమారు 30 లక్షల మంది హోమ్ లోన్ కస్టమర్లు ఉన్నారు.


 అందరి ఎలిజిబిలిటీ బ్యాంక్ బ్రాంచ్‌లో చెక్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆటోమెటిక్‌గా లోన్ రీస్ట్రక్చరింగ్‌కు ఎలిజిబిలిటీని వివరిస్తుంది బ్యాంకు. కస్టమర్ల ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తులో వచ్చే ఆదాయం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని 12 నెలల నుంచి 24 నెలల వరకు మారటోరియం అవకాశం ఇస్తుంది.

Thanks for reading SBI Loan: An excellent opportunity from SBI for those who are unable to pay EMI

No comments:

Post a Comment