Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 19, 2020

SBI New Rules .. Account Holders Must Know!


SBI కొత్త రూల్స్.. ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే!
sBI New Rules .. Clients Must Know!
ఎస్‌బీఐ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్  కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చింది. దీంతో బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌‌లో మార్పులు చేసింది. ఏటీఎం మోసాలను నియంత్రించాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఎస్‌బీఐ ఈ ఏడాది జనవరి నుంచే ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.10,000 లేదా ఆపైన మొత్తాన్ని ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకోవాలంటే ఏటీఎం కార్డు పిన్‌తోపాటు కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి డబ్బులు తీసుకోవాలి

ఇప్పటి వరకు ఈ సదుపాయం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఎస్‌బీఐ తన ఓటీపీ ఆధారిత ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను రోజంతా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అంటే మీరు ఎప్పుడైనాసరే ఎస్‌బీఐ నుంచి రూ.10,000కు పైన డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. అంటే మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ వెంట ఏటీఎం సెంటర్‌కు తీసుకెళ్లాలి.

ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను 24 గంటలు అందుబాటులోకి తీసుకురావడంతో ఏటీఎం మోసాలు తగ్గుతాయని బ్యాంక్ విశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు కలిగిన వారు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి వెళ్లేటప్పుడు మొబైల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు.

కాగా ఈ ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్ ఏటీఎం ఎస్‌బీలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వర్తించదు. కాగా స్టేట్ బ్యాంక్.. అసెట్స్, డిపాజిట్స్, బ్రాంచులు, కస్టమర్లు, ఉద్యోగులు ఇలా ఏ ప్రాతిపదికన చూసిన దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. 2020 మార్చి 31 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్ బేస్ రూ.32 లక్షల కోట్లుగా ఉందని చెప్పుకోవచ్చు

Thanks for reading SBI New Rules .. Account Holders Must Know!

No comments:

Post a Comment