Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 22, 2020

Soon the DSC-2020... will conduct a tet‌ before that.


త్వరలో డీఎస్సీ దానికి ముందు టెట్‌ నిర్వహిస్తాం
టెట్‌ విధివిధానాలు, సిలబస్‌ సిద్ధం

2018 డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తి కాగానే చర్యలు

మంత్రి ఆదిమూలపు సురేశ్‌

2018 ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ విడుదల

 అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ-2020పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. డీఎస్సీ కంటే ముందు టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2018 డీఎస్సీకి సంబంధించిన కోర్టు వ్యాజ్యాలన్నింటిని పరిష్కరింపజేసి త్వరగా ఆ పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు.

అవన్నీ పూర్తయ్యాక టెట్, డీఎస్సీ-2020 నిర్వహణకు చర్యలు చేపడతామన్నారు. టెట్‌ విధివిధానాలు, సిలబస్‌ను సిద్ధం చేశామని తెలిపారు. నూతన విద్యావిధానానికి, మారుతున్న పాఠశాల సిలబస్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెట్‌ సిలబస్‌ ఉంటుందని వివరించారు.

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై నేడు నిర్ణయం
► ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకుంటాం.
► ఈసారి టెన్త్‌లో మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికొస్తాం.
► మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పెట్టాలా? లేదా ఇంకా వేరే ఏదైనా మార్గముందా అనేది పరిశీలిస్తాం.
► డీసెట్‌ రాసి అర్హత సాధించకున్నా, రాయకున్నా స్పాట్‌ అడ్మిషన్ల పేరిట ప్రవేశాలు పొందిన 2017-2019 బ్యాచ్‌ అభ్యర్థులకు పరీక్షల నిర్వహణ విషయమై కోర్టు తీర్పుననుసరించి నిర్ణయం తీసుకుంటాం.

ఇంటర్‌ సిలబస్‌ను తగ్గిస్తాం..
► ఇంటర్మీడియెట్‌ తరగతులు ఆలస్యమైనందున ముఖ్యాంశాలను వదలకుండా సీబీఎస్‌ఈ తరహాలో సిలబస్‌ను తగ్గిస్తాం.
► 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులు అక్టోబర్‌ 5 నుంచి చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం.
► జగనన్న విద్యా కానుకకు సంబంధించిన అన్ని వస్తువులు ఆయా స్కూళ్లకు చేరాయి. సీఎం ఆదేశాల మేరకు వీటిని నిర్ణీత తేదీన విద్యార్థులకు అందిస్తాం.
► నూతన విద్యావిధానం ప్రకారం.. 2020-21 విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నాం.
► స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ముందుగా ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించనున్నాం.
► టీచర్లకు త్వరలోనే వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు ఉంటాయి.

25 నుంచి ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌
న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ షెడ్యూల్‌ ప్రకటించారు.
- 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌లో 3,524 సెకండరీ గ్రేడ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు.
- ఆ తర్వాత పరీక్షల నిర్వహణ, మెరిట్‌ జాబితాల రూపకల్పన చేసి 2,203 మంది ధ్రువపత్రాలను ఆయా జిల్లాల విద్యాధికారులు పరిశీలన చేశారు. వ్యాజ్యాల కారణంగా ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది.
- ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్‌ నెంబర్లకు సంక్షిప్త సందేశాలను పంపిస్తారు.
- అనంతరం వారు తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి.
- అదే రోజు ఆయా జిల్లాల్లోని 3, 4 కేటగిరీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీల జాబితాను డీఈవో ఆఫీస్‌ పోర్టళ్లలో ప్రదర్శిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి అదే రోజున నియామక ఉత్తర్వులు అందిస్తారు.
- ఈనెల 28న తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది.
- కాగా ఇప్పటికీ పలు వ్యాజ్యాల కారణంగా నిలిచిపోయిన మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన మొత్తం 949 పోస్టులను కూడా కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నియామకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుల్లో 374 స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు, లాంగ్వేజ్‌ పండిట్స్‌-తెలుగు) పోస్టులు, 486 పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్లు, 89 ప్రిన్సిపాల్స్‌ పోస్టులున్నాయి.

Thanks for reading Soon the DSC-2020... will conduct a tet‌ before that.

No comments:

Post a Comment