ఉద్యోగులకు ఒక డీఏ వేతన బకాయిలు
♦ఐదు వాయిదాల్లో చెల్లింపు
♦అధికారులకు సీఎం జగన్ఆదేశాలు
♦త్వరలో ఉత్తర్వులు
🌻అమరావతి :కరోనాతో లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఉద్యోగుల జీతాల బకాయిలు, కరవు బత్యం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక, ప్రణాళిక, ఇతర ముఖ్యశాఖల ఉన్నతాధికారులతో బుధవారం క్యాంప్ కార్యాలయంలో చర్చించారు. ప్రస్తుతానికి ఒక డీఏతో పాటు వేతన బకాయిలు 5 వాయిదాల్లో చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు నాలుగు డీఏలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు కరోనా విజృంభణ కారణంగా ఏప్రిల్, మే నెలల వేతనాల్లో సగభాగం మాత్రమే చెల్లింపులు జరిగాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు చేసిన అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు ఉద్యోగులకు బాసటగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయటం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు కాగా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని మరో డీఏ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
♦పీఆర్ సీ పై కమిటీ?
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగుల వేతన సవరణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దీనిపై కమిటీ వేయాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. 2018 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్ సీ కు సంబంధించి ఇటీవలే పీఆర్సీ కమిషనర్ అసుతోష్ మిశ్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి నివేదిక సమర్పించారు. నివేదిక అందిన తరువాత కమిషనర్ సిఫార్సులపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది.
AP state government employees 2018 JULY Dearness Allowance (DA) Ready Reckoner @ 30.392% ..
Thanks for reading 2018 JULY Dearness Allowance (DA) Ready Reckoner @ 30.392% ..
No comments:
Post a Comment