Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 31, 2020

Andhra Pradesh And Telangana NEET 2020 State Ranks List Released


  Andhra Pradesh And Telangana NEET 2020 State Ranks List Released



తెలంగాణ

నీట్‌ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి పేర్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది.

రెండు వారాల కింద జాతీయస్థాయిలో నీట్‌ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచింది. రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ముగ్గురు బాలికలు ఉండగా, మొదటి 50 స్థానాల్లో 29 మంది బాలురు ఉన్నారు. బాలికలు మాత్రం 21 మంది ఉన్నారు.

సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులు వెల్లడించిన అనంతరం దరఖాస్తులు ఆహావనించి, అందులో నుంచి తుది ర్యాంకులు ప్రకటిస్తారు.ఈసారి ఇప్పటికే నీట్‌ నిర్వహణలో జాప్యం వల్ల వేగంగా ప్రవేశాలు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటన కూడా ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది.

వచ్చే నెల 1న ఆన్‌లైన్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ మెడికల్‌ ప్రవేశాలకు ప్రకటన నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. ఈసారి ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టే అవకాశముంది. ఒకవేళ నేరుగా సరి్టఫికెట్లు పరిశీలించాల్సి వస్తే పెద్ద సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 10 రోజులు పట్టే అవకాశం ఉండటంతో వచ్చే నెల 20న తొలి విడత మెడికల్‌ సీట్లు కేటాయించనున్నారు.

ఆంధ్రప్రదేశ్

అమరావతి,   ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు శనివారం ఏపీ నీట్‌ ర్యాంక్‌లను ప్రకటించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ శంకర్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో నీట్‌కు 43,977 మంది హాజరు కాగా 35,270 మంది అర్హత సాధించారు. జనరల్‌ క్యాటగిరీ అభ్యర్థులకు కటాఫ్‌ 147 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్‌ 113 మార్కులు, దివ్యాంగుల్లో ఓసీ అభ్యర్థులకు 129, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 113 మార్కులుగా కటాఫ్‌ ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంక్‌ సాధించిన చైతన్య సింధు ఏపీలో మొదటి ర్యాంక్‌ సాధించింది. కె. వెంకట్‌కు రెండో ర్యాంక్‌, భవనం మానస మూడో ర్యాంక్‌, ఎస్‌కె ఆఫ్తాఫ్‌ ఖాదర్‌ నాలుగో ర్యాంకు, ఎల్‌.శేఖర్‌ సాత్విక్‌ శర్మ ఐదవ ర్యాంక్‌, బి.శివరామకృష్ణ ఆరవ ర్యాంక్‌, దాసరి సాయి చంద్రధర్‌ ఏడవ ర్యాంక్‌, టి.శ్వేత గాయత్రి 8వ ర్యాంక్‌, వై.మహితా రెడ్డి 9వ ర్యాంక్‌, ఎం.లలితకుమార్‌రెడ్డి 10వ ర్యాంక్‌ సాధించారు. వీరంతా జాతీయ స్థాయి టాప్‌ ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఏపీలో 29 మెడికల్‌ కాలేజీల్లో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు, 16 డెంటల్‌ కాలేజీల్లో 1,440 బీడీఎస్‌ సీట్లు ఉన్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు


తెలంగాణ ర్యాంకుల జాబితాను

http://www.knruhs.telangana.gov.in/ 

ఏపీ జాబితా:

MBBS_NEET_Qualified_AP List2020

Thanks for reading Andhra Pradesh And Telangana NEET 2020 State Ranks List Released

No comments:

Post a Comment