Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 29, 2020

ఈ విద్యా సంవత్సరం మిథ్యేనా !


 ఈ విద్యా సంవత్సరం మిథ్యేనా !

కరోనా తగ్గుముఖం పట్టిందా ! ప్రజలు భయం లేకుం డా తిరుగుతున్నారా ! కరోన విషయంలో రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది . ముఖ్యంగా విద్యా వ్యవస్థ కరోన వల్ల పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది . కరోనా ఆ v క్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మినహయింపులు ఇస్తూ వస్తోంది . ప్రస్తు తపరిస్థితుల్లో చాలా వరకు మునుపు ఉన్నన్ని కేసులు లేవు అని రికార్డు చెబుతోంది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు , 30 రాష్ట్రాలోను , కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి తగ్గింది . ఇది మంచి పరిణామమే . ఇప్పటికే డిగ్రీ ప్రథమ , ద్వితీయ సంవత్సరాల పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో పకడ్బందీగా జరుగుతున్నాయి . ఫైనల్ పరీక్షలు ఎలాగో నిర్వహించి విజ యం సాధించారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని ప్రకటించింది . ఆన్ లాక్ 5 మార్గ దర్శకాలు మరో మాసం పాటు ఈ నవంబర్ లోనూ కొనసాగు తాయని కేంద్రం స్పష్టం చేసింది . ఈ అంశంపై పాఠశాలలు ఎప్పుడు తెరవాలి , విద్యాసంవత్సరం కొనసాగింపు ఎలా ? అనే మీమాంస ఉంది . కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు . వ్యాక్సిన్ సంగతి దేవుడెరుగు అసలు దాదాపు 80 శాతం పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్ల కు పంపడానికి ఆసక్తి చూపడం లేదు . వారందరిది ఒకే మాట వ్యాక్సిన్ వచ్చినా మెరుగైన ఫలితాలు వచ్చే వరకు స్కూల్స్ కు పంపబోమని . ఇప్పుడు విద్యా సంవత్సరం తల్లిదండ్రుల నిర్ణ యాన్ని బట్టి నిర్ధారించవలసి ఉంటుంది . ప్రభుత్వం పాఠశాల లు తెరుస్తాం .. కొందరికి ఉదయం .. మరికొందరికి మధ్యా హ్నం అని ఎన్ని ప్రకటనలు చేసినా పాఠశాలలకు రావడానికి పిల్లలు జంకుతున్నారు . ముఖ్యంగా తల్లిదండ్రులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు . పాఠశాలలో తోటి విద్యార్ధులతో ఆడిపాడి వచ్చే తమ పిల్లలకు కరోనా సోకుతుందోమోనని వారు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు . అందువల్ల ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుచుకునే అవకాశాలు మృగ్యం . నవంబర్ 30 వరకు మూసివేయాలని కేంద్రం ప్రకటన . రాష్ట్రాలు ఈ విషయా న్ని పరిశీలిస్తాయా అనే సందిగ్ధత నెలకొని ఉంది . ఏది ఏమైన ప్పటికీ పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్రాలు ఆసక్తి గా ఉన్నా పిల్లల ప్రాణాలకు గ్యారెంటీ ఏమిటి ? అనే ప్రశ్న వస్తోంది . అందు వల్లనే కేంద్రం చాలా దీర్ఘంగా , లోతుగా ఆలోచించిన తర్వాత కొత్త ఆదేశాన్ని కేంద్ర హోంశాఖ జారీ చేసింది . డిజాస్టర్ మనేజిమెంట్ యాక్ట్ 2005 లోని సెక్షన్ 10 ( 2 ) ( 1 ) అధికారాలు ఉపయోగించు కుంటూ ఈ ఆదేశాలు జారీ చేసింది . దీని ప్రకా రంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నవంబర్ 30 వరకు పాఠశాలలు తెరవడానికి వీలు లేని పరిస్థితి . ఒక వేళ కేంద్ర ఆదేశాలు ఉల్లం ఘించి రాష్ట్రాలు ప్రవర్తిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకో వలసి వస్తుంది . ముఖ్యంగా తల్లిదండ్రులతో ఘర్షణలు జరిగే అవకాశాలు మెండు . ఇప్పటికే సగం పైగా విద్యా సంవత్సరం నష్టం జరిగింది . ఇది ఇలాగే కొనసాగితే విద్యా సంవత్సరం పూర్తిగా మిథ్యగా మారే పరిస్థితి వస్తుంది . ఇక ఆన్ లైన్ తరగతు లు ఎటువంటి ప్రయోజనాలు ఇవ్వవు . ముందు వీటిని నిషేదిం చాలి . కొందరికి జరిగి , కొందరికి జరగకపోవటం దేనికి సంకేత మో అర్థం కావడం లేదు . విద్యాసంవత్సరంపై ప్రతినెల సమీక్ష లు జరిపి వాయిదా వేయడం వలన పాఠశాలలు ఈ సంవత్స రం వరకు పని చేయవని రూఢి అవుతోంది . దీనికి ప్రత్యామ్నా య పరిస్థితులు ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది .

Thanks for reading ఈ విద్యా సంవత్సరం మిథ్యేనా !

No comments:

Post a Comment