♦సైనిక్ స్కూళ్ళ ఎంట్రన్స్ నిర్వహణ NTA అప్పగింత
❇️సైనిక్ స్కూళ్ళలో ఆరు, తొమ్మిది తరగతుల ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలను ఇక నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు.
❇️గతంలో ఈ ప్రవేశ పరీక్షలను సైనిక పాఠశాలల సొసైటీనే నిర్వహించేది. అయితే ఈ ఏడాది నుంచి పరీక్షల నిర్వహణ బాధ్యత ఎసీఏ స్వీకరించింది.
❇️దేశవ్యాప్తంగా వున్న 33 పాఠశాలలకు ఆరు, తొమ్మిదవ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
❇️ఆరవ తరగతి ప్రవేశానికి 2021 మార్చి 31 నాటికి 12 సంవత్సరాల మధ్య వారై వుండాలి.
❇️తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి అదే తేదీ నాటికి 18 ఏళ్ళ మధ్య వారై వుండాలి.
❇️బాలికల కోసం అన్ని సైనిక స్కూళ్ళలోనూ ఆరవ తరగతిలో మాత్రమే ప్రవేశాలుంటాయి.
❇️ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశ రుసుము రూ.400 కాగా ఇతరులందరికీ రూ.550గా నిర్ణయించారు.
❇️వచ్చే ఏడాది జనవరి 10 ప్రవేశ పరీక్షలుంటాయి.
❇️దరఖాస్తుకు చివరి తేదీ 2020 నవంబరు 19.
❇️ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.
❇️పరీక్ష రుసుము కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
❇️పాఠశాలల వారీగా అందుబాటులో వున్న సీట్లు, రిజర్వేషన్ వివరాలు, పరీక్షా విధానాలు, పరీక్షలు జరిగే కేంద్రాలు తదితర వివరాల కోసం aissee.nta.nic శోధించవచ్చు.
Thanks for reading Entrance management of Sainik Schools handed over to NTA
No comments:
Post a Comment