Google Pay యూజర్స్.... బీ అలెర్ట్
డిజిటల్ వేదికగా ఎప్పుడైతే Google Payవచ్చేసిందో అప్పటి నుంచి ప్రజలకు నగదు బాధలు తప్పాయి. అకౌంట్లో డబ్బులున్నాయా.. సెకండ్లలో ఇతరులకు పంపించే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీల కోసం ప్రస్తుతం పేటీఎం తర్వాత ఎక్కువమంది వాడుతున్న యాప్ Google Payనే. వాడడానికి చాలా ఈజీగా ఉండడంతో పాటు రివార్డ్ కింద తిరిగి మన ఖాతాలోకే కొంత డబ్బులు వేయడం ఈ యాప్ స్పెషాలిటీ.
అయితే.. ఓ సరికొత్త మోసానికి తెరలేచింది.
ఇప్పటి వరకు మనం ఎవరికైనా గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తే ఓ స్క్రాచ్ కూపన్ వస్తుంది. దానిని స్క్రాచ్ చేస్తే కొన్ని డబ్బులు రావడమా.. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ రావడమా చూస్తున్నాం. ఒకవేళ అమౌంట్ వస్తే అది ఆటోమెటిక్‌గా మన ఖాతాలో డెబిట్ అయిపోతుంటుంది. కానీ.. ఇక్కడ మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్క్రాచ్ చేసిన తర్వాత 7000 రూపాయలు లేదా 9000 రూపాయలు రివార్డ్ వచ్చినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత అది వేరే లింక్‌కు రీ-డైరెక్ట్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేశామంటే.. మన ఎకౌంట్ నుంచి డబ్బులు మాయం అవుతున్నాయి.గూగుల్ పేలో రివార్డులు వచ్చాయంటూ మనకు ఎలాంటి మెస్సేజ్‌లు, వాట్సాప్ సందేశాలు రావు. అలా వచ్చాయంటే అది ఫేక్ అని గమనించాలి. ఇక రివార్డు మీద స్క్రాచ్ చేసిన తర్వాత డబ్బులు ఆటోమేటిగ్గా ఎకౌంట్‌లో పడతాయి తప్ప మరో లింక్ ఓపెన్ అవ్వదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
గూగుల్ ఇప్పటివరకైతే.. రూ.5, 51, 80, 110 వచ్చాయంటే వెంటనే యాడ్ చేసేస్తోంది. చాలా మంది యూజర్లకు అయితే ఇప్పటివరకు రూ.5 లకు మించి రాదు. గరిష్టంగా 500 రూపాయలు మాత్రం వస్తాయి. 9 వేలు, 10 వేలు రివార్డ్ అని చూపిస్తే మాత్రం మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.
Thanks for reading Google Pay Users .... Be Alert


No comments:
Post a Comment