Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 4, 2020

How much longer? Step-by-step movement from FAPTO to protest over indefinite delay in teacher transfers


ఇంకెంతకాలం ? టీచర్ల బదిలీల పై వీడని సందిగ్ధం జాప్యం పై ఫ్యాప్టో నిరసన ●8 నుంచి దశలవారీ ఉద్యమం.


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : టీచర్ల బదిలీల పై ఇంకా సందిగ్ధత వీడలేదు . బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పటికి జారీ చేస్తుందనే అంశంపైనా ఉత్కంఠ నెలకొంది . డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం టీచర్ల బదిలీలకు గతంలో ఎన్నడూ చేయనంత కసరత్తుచేసి , నివేదికలను సిద్ధం చేసి పెట్టుకుందని ఉపాధ్యాయులు అంటున్నారు . గతంలో బదిలీల ప్రక్రియను ఉత్తర్వులు జారీ అయిన తరువాత చేసేవారు . ఈసారి ముందస్తుగానే పూర్తి చేశారు . జిల్లాల వారీగా బదిలీకి అవకాశమున్న ఉపాధ్యాయుల జాబితా , బదిలీకి ఉన్న ప్రత్యేక అవకాశాలను గతంలో ఉపయోగించుకున్నవారు , తదితర అంశాలను క్రోడీకరించి , నివేదికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది .

 • సర్దుబాటుకే మొగ్గు 

కరేనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుకే మొగ్గుచూపుతున్నారు . బదిలీలు జరిగితే 2020 ఫిబ్రవరి నెలాఖరు నాటికి యూడైస్ నిబంధనల ప్రకారం పాఠశాలలో ఉన్న విద్యార్థులు , ఉపాధ్యాయుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది . విద్యార్థుల సంఖ్య పెరిగితే , దానినే పరిగణనలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి . గతంలో రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు లేని కారణంగా కొన్ని పాఠశాలలను మూసివేశారని , ఈసారి ఈసారి పాఠశాలలను మూసివేయకుండా , ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ఉంచుతామని ప్రభుత్వం చెబుతోంది . ఏదైనా పాఠశాలలో 41 మంది పిల్లలుంటే ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతుండగా , విద్యాశాఖ ఉన్నతాధికారులు 61 మంది ఉంటేనే ముగ్గురిని కేటాయిస్తామంటున్నారు . ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన టీచర్లు ఉన్నారని , దీనిని దృష్టిలో ఉంచుకుని బదిలీ ఉత్తర్వులు విడుదల చేసేవరకూ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలని సంఘాలు కోరుతున్నాయి . విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను ఏర్పాటు చేయాలంటే కొత్త పోస్టులను ప్రకటించాలి . ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికశాఖ ఇందుకు అంగీకరిస్తుందా ? అనేది ప్రశ్నార్థకంగా ఉంది . బదిలీలు , ఇతరత్రా అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు , విద్యాశాఖఉన్నతాధికారులు ఈనెల ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సమావేశం కావాలని నిర్ణయించారు . అదే రోజు సీఎం డిల్లీ పర్యటనకు వెళ్లనుండటంతో సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదంటున్నారు . ఉపాధ్యాయ సంఘాల నాయకులు , 

• అకడమిక్ హాలీడేకు దారి తీస్తుందా ? 

కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఈ ఏడాది అకడమిక్ హాలీడేకు దారితీసేలా ఉన్నాయని ఏ పి టి ఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ అన్నారు . అలాక్ 5.0 లో పది సంవత్సరాల్లోపు పిల్లలను అక్టోబరు నెలాఖరు వరకు పాఠశాలలకు పంపవద్దనే నిబంధనలు విదించారని , తొమ్మిది , పది తరగతుల విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకునేందుకే పాఠశాలలకు రావాలని చెప్పారని , ఇవన్నీ అకడమిక్ హాలీడేకు సూచనలుగా కనపడుతున్నాయని ఆయన అన్నారు . 


8 నుంచి ఫ్యాప్టో ఆందోళనలు

 ఉపాధ్యాయుల బదిలీలు , పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని , ప్రభుత్వ బదిలీలను నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) ప్రత్యక్ష కార్యాచరణ నోటీసును ఇటీవలే ప్రభుత్వానికి అందజేసింది . ఈ నెల 8 వ తేదీ నుంచి దశలవారీగా అన్ని జిల్లాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు అందులో పేర్కొంది .

Thanks for reading How much longer? Step-by-step movement from FAPTO to protest over indefinite delay in teacher transfers

No comments:

Post a Comment