Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 10, 2020

Is the green light on in the ATM? Otherwise your account is empty ..!


ఏటీఎంలో గ్రీన్ లైట్ వెలుగుతోందా .. ? లేదంటే మీ అకౌంట్ ఖాళీ .. !


 సమాజంలో ప్రతి ఒక్కరు బ్యాంకు అకౌంట్ ను కలిగి ఉన్నారు. ఇక బ్యాంకులు తమ కస్టమర్లకు బ్యాంకు అకౌంట్ తో పాటు ఎటిఎం కార్డ్స్ ను కూడా అందిస్తున్నారు. అయితే మీరు ఎటిఎంకి వెళ్తున్నారా. అయితే మీరు ఈ విషయం గురించే తెలుసుకోవాల్సిందే. మీ బ్యాంకు ఏటీఎం సెంటర్లలో మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే మోసగాళ్లు ఏటీఎం సెంటర్లలో బ్యాంక్ కస్టమర్ల నుంచి అకౌంట్ వివరాలను తస్కరించి డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. ఏ చిన్న పొరపాటు చేసినా అకౌంట్లో డబ్బులు మాయం అవుతాయి. మీరు ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు డెబిట్ కార్డు పెట్టే స్లాట్ దగ్గర గ్రీన్ కలర్ లైట్ ఒకటి ఉంటుంది.

ఇక ఏటీఎం కార్డు పెట్టే స్లాట్ లూజ్‌గా ఉన్నా..లేదంటే దాని కింద ఏదైనా అంటించి ఉన్నా వెంటనే ఆ ఏటీఎం సెంటర్ నుంచి బయటకు వచ్చేయండి అని నిపుణులు తెలిపారు. ఇక ఆ ఏటీఎం మెషీన్ ఉపయోగించొద్దు. అలాగే గ్రీన్ లైన్ కూడా గమనించండి. లైట్ ఉంటే ఆ ఏటీఎం సేఫ్ అని భావించొచ్చునని అన్నారు. ఒకవేళ గ్రీన్ లైట్ బదులుగా వేరే లైట్ ఉంటే ఆ ఏటీఎం మెషీన్ వాడకండి. డబ్బులు తీసుకోవద్ద. వేరే ఏటీఎం మెషీన్‌కు వెళ్లండి అని అంటున్నారు.


ఇక గ్రీన్ లైట్ ఉందంటే ఆ ఏటీఎం కరెక్ట్‌గా పనిచేస్తోందని భావించాలని అన్నారు. లేకుంటే హ్యాకర్లు బ్యాంక్ ఏటీఎం మెషీన్‌లోని కార్డ్ స్లాట్ ద్వారా సులభంగానే బ్యాంక్ కస్టమర్ల వివరాలను తస్కరిస్తారని తెలిపారు. అంతేకాదు ఆ స్లాట్‌లో మోసగాళ్లు ఏదైనా పరికరాన్ని అమర్చుతారని కూడా తెలిపారు. ఇది మీ కార్డు వివరాలను స్కాన్ చేసి వారికి పంపిస్తుందని అన్నారు. దీంతో వారు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారని తెలిపారు.


అంతేకాదు మీరు ఒకవేళ మోసపోయినట్లు అయితే వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇక బ్యాంక్ పనిచేయకపోతే వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేయాలని తెలిపారు. వారు ఏటీఎం కార్డ్ స్లాట్‌పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ లేదా ఏటీఎం సెంటర్‌కు దగ్గరిలోని బ్లూటూత్ డివైజ్‌ల సాయంతో మోసగాళ్లను పట్టుకునే ఛాన్స్ ఉందన్నారు. ఇంకా ఏటీఎం పిన్ ఎంటర్ చేసేటప్పుడు చేతికి అడ్డుగా పెట్టుకోండని తెలిపారు. లేకుంటే హ్యాకర్లు కెమెరాల సాయంతో మీ పాస్‌వర్డ్‌ను గమనిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Thanks for reading Is the green light on in the ATM? Otherwise your account is empty ..!

No comments:

Post a Comment