Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 10, 2020

YSR Jalakala: Jagan Sarkar is another good news for the farmers .. Key changes in the scheme


 YSR Jalakala : రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త .. ఆ పథకంలో కీలక మార్పులు

 

YSR Jalakala: Jagan Sarkar is another good news for the farmers .. Key changes in the scheme

రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఏపీలోని జగన్ ప్రభుత్వం.. తాజాగా వారికి మరో తీపి కబురు అందించింది. వైఎస్ఆర్ జలకళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను ఉచితంగానే అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్ఆర్ జలకళ పథకంలో ఏపీ సర్కార్ స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వటంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు. ఉచితంగానే పంపుసెట్లు, మోటార్లు బిగించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు వాటికి ఉచితంగానే విద్యుత్ కనెక్షన్స్ కూడా అమర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బోర్ల లోతు, భూమి రకం, ఎంత మేర పంట సాగవుతోందన్న అంశాల ఆధారంగా పంపు సెట్లు, మోటార్లను బిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైఎస్‌ఆర్ జలకళను ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 28న ప్రారంభించింది. ఏపీలో చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా... ఫ్రీగా బోర్లు తవ్వించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పథకం ప్రారంభమయ్యాక... తమకు బోర్ కావాలనుకునే రైతులు... ప్రత్యేక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ని కూడా 28నే సీఎం జగన్ ప్రారంభిస్తారు. దరఖాస్తును పరిశీలించి... భూగర్భ అధికారులు... రైతు పొలం దగ్గరకు వెళ్తారు. భూ గర్భంలో ఎక్కడ నీరు ఎక్కువ ఉందో టెక్నికల్ పరికరాల ద్వారా గమనిస్తారు. ఆ తర్వాత... అక్కడ బోర్ వేస్తే... రైతుకి పొలానికి కావాల్సినంత జలం వస్తుందా, అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది గమనిస్తారు. అంతా సెట్ చేసుకున్నాక... రైతును ఓసారి అడుగుతారు. రైతు సరే అనగానే... బోర్ రిగ్ వాహనం వచ్చేస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున బోర్ తవ్వేస్తుంది. పాతాళ గంగ పైకి ప్రవహిస్తూ... రైతు పొలాల్ని సస్యశ్యామలం చేస్తుంది.


ఇదంతా ఒక్క రోజులో అయిపోదు. బోర్ తవ్వేందుకు టైమ్ పడుతుంది. అప్లై చేసుకున్న చిన్న సన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనం తప్పక లభించాలనీ, అందుకు పూర్తి వాతావరణం కల్పించాలని సీఎం జగన్... అధికారులను, జిల్లా యంత్రాంగాల్నీ ఆదేశించారు.

బోర్ కోసం అప్లై చేసుకునే రైతులు... ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ విధానం లేకపోతే... MPDOల ద్వారా నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్‌ విభాగపు డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు. అందువల్ల తమకు వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యడం తెలియదనుకునే రైతులు... MPDOలను కలిసి సమస్య చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే ఈ పని పూర్తి కావాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరైనా అధికారులు లంచం అడిగితే... రైతులు కంప్లైంట్ ఇవ్వొచ్చు.


Thanks for reading YSR Jalakala: Jagan Sarkar is another good news for the farmers .. Key changes in the scheme

No comments:

Post a Comment