Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 11, 2020

Jobs: Teaching posts in Railway Institute ..


 Jobs : రైల్వే ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ పోస్టులు ... ఖాళీల వివరాలు ఇవే

Jobs: Teaching posts in Railway Institute ..


నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. మొత్తం 39 ఖాళీలను భర్తీ చేస్తోంది ఎన్ఆర్‌టీఐ. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కేవలం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికన్నా ముందు విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవాలి.

మొత్తం ఖాళీలు- 39

ప్రొఫెసర్- 5

అసోసియేట్ ప్రొఫెసర్- 10

అసిస్టెంట్ ప్రొఫెసర్- 15

డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్- 1జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 1

అసిస్టెంట్ లైబ్రేరియన్- 1

అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- 2

జూనియర్ అసిస్టెంట్- 2

దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 11

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 10

విద్యార్హతలు- అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. కనీసం 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన ఆధారాలుండాలి. ప్రొఫెసర్‌గా 5 నుంచి 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ, అనుభవం తప్పనిసరి.

వయస్సు- 55 ఏళ్ల లోపు

నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI భారతీయ రైల్వేకు చెందిన విద్యా సంస్థ ఇది. 2018లో ఏర్పాటైంది. భారతదేశంలోనే రవాణా రంగానికి సంబంధించిన కోర్సుల్ని అందించే మొదటి ఇన్‌స్టిట్యూట్ ఇదే. విద్యార్థులు యూజీ, పీజీ కోర్సులు చేయొచ్చు. రైల్వేలో లేదా రవాణా రంగంలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, బీఎస్‌సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు చేయొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ట్రాన్స్‌పోర్ట్ ఎకనమిక్స్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్‌లో ఎంఎస్సీ కోర్సులున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌తో కలిసి ఎంఎస్ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంటర్నేషనల్ డిగ్రీ ప్రోగ్రామ్ అందిస్తోంది ఎన్ఆర్‌టీఐ.

Important Dates:

Last date for submission of an online application by 10.11.2020.

Important Links:

NRTI Teaching & Non-Teaching 2020 Job Notification

Apply Online

Thanks for reading Jobs: Teaching posts in Railway Institute ..

No comments:

Post a Comment