Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, October 11, 2020

What are the precautions to be taken by diabetic patients to prevent corona infection?


 కరోనా సోకకుండా డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే .. ?

 


ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సోకుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కరోనా సోకితే వైరస్ నుంచి కోలుకున్నా భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడే వాళ్లకు కరోనా సోకితే మరింత ప్రమాదకరం. డయాబెటిస్ రోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే కరోనా సోకకుండా తమను తాము రక్షించుకోగలుగుతారు.

కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది డయాబెటిస్ రోగులే కావడం గమనార్హం.డయాబెటిస్ రోగులకు కరోనా సోకితే అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ తో బాధ పడుతున్న కరోనా రోగులకు చికిత్స అందించడంలో వైద్యులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఊబకాయం, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు కరోనా వల్ల డయాబెటిస్ రోగులుగా మారుతున్నారు.

అయితే వైరస్ సోకాకుండా కరోనా రోగులు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరైన ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. డయాబెటిస్ రోగులు ఉదయం లేచిన గంటలోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. రాత్రి 9 తరువాత ఆహారం తీసుకోకూడదు. రెండు పూటలా భోజనం, రెండు సార్లు స్నాక్స్ సరైన సమయాల్లో తీసుకోవాలి. ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డయాబెటిస్ తో బాధ పడేవారు అధిక ప్రోటీన్ తో కూడిన ఆహారం షుగర్ రోగులకు మంచిదని సూచిస్తోంది. చికెన్ బ్రెస్ట్, గుడ్లు, చేపలు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయి. వేరుశెనగ నూనె, ఆవాలు, నువ్వులు కలిపిన నూనె డయాబెటిస్ రోగులు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలను తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటితో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చు.

Thanks for reading What are the precautions to be taken by diabetic patients to prevent corona infection?

No comments:

Post a Comment