Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 27, 2020

AP Cabinet meeting Highlights 27.11.20


 AP Cabinet meeting Highlights 27.11.20

AP Cabinet meeting Highlights 27.11.20

2 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశం 

సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించారు. నష్టపరిహారంపై అంచనాలను డిసెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పరిహారం చెల్లించాలని సీఎం తెలిపారు. 40 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం సూచించారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందజేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమావేశంలో  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై చర్చించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం పథకాలపైనా చర్చించారు. ఉద్యోగులకు దశల వారీగా డీఏ బకాయిల చెల్లింపులతో పాటు పలు అంశాలపై చర్చ సాగింది.


నివర్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


ఇటీవల కాలంలో ఇంటి పన్నును సవరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొంది.ఈ మేరకు తీసుకొచ్చిన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.


30.20 లక్షల మందికి డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది ఏపీ సర్కార్. లే ఔట్ల అభివృద్ది, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నెల 21నుండి భూముల రీ సర్వే కు కేబినెట్ అంగీకరించింది. డిసెంబర్ 8న 2.49 లక్షల మందికి గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.


ఎవరైతే నివర్ తుఫాను ప్రభావంతో నిరాశ్రయులై శిబిరాల్లో తలదాచుకుంటున్నారో వాళ్లందరికీ చిన్నా, పెద్దా అనే బేధం లేకుండా రూ. 500 చొప్పున సాయం అందిస్తామని కన్నబాబు వెల్లడించారు.


పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటర్‌ కూడా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ డిజైన్‌ల ఆధారంగానే పోలవరం నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.


డిసెంబర్ , జనవరిలో పెండింగ్ జీతాలు AP : ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది . మార్చి , ఏప్రిల్ నెలల పెండింగ్ జీతాల చెల్లింపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది . మార్చి నెల పెండింగ్ జీతాలను డిసెంబర్ లో , ఏప్రిల్ నెల పెండింగ్ జీతాలను జనవరిలో ఇస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు . అటు పేదల కోసం తొలిదశలో 16 లక్షల ఇళ్లను నిర్మిస్తామని .. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని , ఆయా ఇళ్లకు ఉచితంగా ఇసుకను ఇస్తామన్నారు .

Thanks for reading AP Cabinet meeting Highlights 27.11.20

No comments:

Post a Comment