Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 28, 2020

Beginning of the vote registration process


యువతా మేలుకో .. భవిత మార్చుకో .

  •  * ఓటు నమోదు ప్రక్రియ ఆరంభం
  •  * అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సిబ్బంది 
  • * ఆన్లైన్లోనూ డిసెంబర్ 15 వరకు 



 ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం . ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకో వాలి . ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారానే మంచి పాలనకు అవకాశం ఏర్పడుతుంది . ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు . స్థానిక సంస్థలకు ముందు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు . శనివారం నుంచి ఆరంభమైన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుంది . డిసెంబర్ 12 , 18 వ తేదీల్లోనూ ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం జరుగుతుంది . వచ్చే జనవరి 1 వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారందరికి ఓటుహక్కు కల్పిస్తారు .

ఫారం -6 :కొత్తగా ఓటు నమోదుకు

ఫారం -6 ఏ :ప్రవాస భారతీయుల ఓటు నమోదుకు

ఫారం -7 :జాబితాలో నుంచి ఓట్ల తొలగింపునకు,      డబుల్ఎట్రీలు,మృతులు , వలస వెళ్లిన వారి వివరాల తొలగింపునకు

ఫారం -8 :జాబితాలో నమోదైనవివరాల్లో తప్పులు

              సరిచేసుకునేందుకు

ఫారం -8 ఏ:పోలింగ్ స్టేషన్ మార్పునకు ,ఒక చోట                           నుంచి మరో చోటకు మారితే.

      

నేరుగా వెళ్లి నమోదు .. 

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ వోలు హాజరై ఓటరు నమోదు , మార్పులు చేర్పులను చేపడ తారు . పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు , సచి వాలయాలు , తహసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు . నేరుగా వెళ్లి ఫారం -6 అందించవచ్చు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు . ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో నూతన ఓటర్ల జాబితాలను పెట్టారు . వాటిలో పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని .. వెంటనే నమోదు చేసుకోవచ్చు . అంతర్జాలంలోనూ చేసుకోవచ్చు .. డిసెంబర్ 15 వ తేదీలోపు ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకునేం దుకు గడువు ఉంది . గడువులోపు దాఖలైన వాటిని పరిశీలించి 2021 జన వరి 15 న తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది .

 * ఆన్లైన్ ఓటరుగా నమోదుకు అధికారిక వెబ్ సైట్లు : www.nvsp.in ... 

www.ceoandhra.nic.in 

* మరింత సమాచారానికి టోల్ ఫ్రీ నంబరు : 1950

Thanks for reading Beginning of the vote registration process

No comments:

Post a Comment