Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 24, 2020

December New Rules: These are the rules that will come into force in December ... Find out


December New Rules : డిసెంబర్‌లో అమలులోకి వచ్చే రూల్స్ ఇవే ... తెలుసుకోండి

December New Rules: These are the rules that will come into force in December ... Find out

నవంబర్ ముగుస్తోంది. డిసెంబర్ వచ్చేస్తోంది. కొత్త నెల రావడంతో కొత్త రూల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రూల్స్ కొన్ని మారుతున్నాయి. ఈ రూల్స్ సామాన్యులను ప్రభావితం చేసేవే. అందుకే ఈ రూల్స్ తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్-RTGS రూల్స్ మారబోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో కూడా మార్పులు ఉంటాయి. ఇలా అనేక అంశాల్లో కొత్త నియమనిబంధనలు అమల్లోకి వస్తాయి. మరి అవేంటో తెలుసుకోండి.


RTGS: మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉన్న పద్ధతుల్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సిస్టమ్ ఒకటి. భారీగా లావాదేవీలు జరిపేవారికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది.డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి.


LPG Cylinder Prices: ప్రతీ నెల మొదటి రోజు ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఒకటో తేదీని ప్రకటించిన ధరలే ఆ నెలంతా అమలులో ఉంటాయి. డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలపై గ్యాస్ సిలిండర్ల ధరలు ఆధార పడి ఉంటాయి.


Indian Railways: భారతీయ రైల్వే ప్రకటించిన స్పెషల్ ట్రైన్స్ చాలా వరకు నవంబర్ 30 వరకే నడుస్తాయి. వీటిపై భారతీయ రైల్వే నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి రైల్వే సేవలపై త్వరలోనే భారతీయ రైల్వే ప్రకటన చేసే అవకాశం ఉంది.


Saral Jeevan Bima: స్టాండర్డ్ ఇండివిజ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. 2021 జనవరి 1 నుంచి 'సరళ్ జీవన్ బీమా' పేరుతో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని చెప్పింది. అయితే అంతలోపే పాలసీని రూపొందిస్తే ఐఆర్‌డీఏఐ ఆమోదం పొందిన తర్వాత కంపెనీలు పాలసీని అమ్మొచ్చు. అంటే డిసెంబర్‌లోనే 'సరళ్ జీవన్ బీమా' పాలసీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

IndiGo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 1 నుంచి రెండు ఫ్లైట్లను నడపనుంది. విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఈ ఫ్లైట్స్ నడుస్తాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది. విశాఖటప్నంలో మధ్యాహ్నం 3.15 గంటలకు ఫ్లైట్ బయల్దేరి విజయవాడకు సాయంత్రం 4.25 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 12.05 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.50 గంటలకు ఫ్లైట్ బయల్దేరి సాయంత్రం 6.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

Thanks for reading December New Rules: These are the rules that will come into force in December ... Find out

No comments:

Post a Comment