Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 25, 2020

Google Pay: Shock to Google Pay users ... those charges have to be paid


 Google Pay : గూగుల్ పే యూజర్లకు షాక్ ... ఆ ఛార్జీలు చెల్లించాల్సిందే

Google Pay: Shock to Google Pay users ... those charges have to be paid


Google pay... డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. బిల్లులు చెల్లించడం దగ్గర్నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవరకు అనేక సేవల్ని పొందొచ్చు. ఇటీవల అమెరికాలో Google pay కొత్త యాప్ రిలీజ్ అయింది. ఆ కొత్త యాప్ ఇండియాలో కూడా రానుంది. Google pay కొత్త అవతారంలో వస్తుండటంతో అనేక మార్పులు కూడా ఉండబోతున్నాయి. కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. పాత ఫీచర్స్ కనిపించకుండ పోతాయి. Google pay యూజర్లు 2021 జనవరి నుంచి వెబ్‌సైట్ ఉపయోగించడానికి వీల్లేదు. pay.google.com పేరుతో వెబ్‌సైట్ ఉన్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఈ వెబ్‌సైట్ పనిచేయదు. అంటే ఈ వెబ్‌సైట్ నుంచి డబ్బులు పంపడం, స్వీకరించడం సాధ్యం కాదు. అమెరికాలో కొత్తగా Google pay యాప్ లాంఛ్ చేసిన Google...వెబ్ యాప్‌ను తొలగించింది. పాత Google pay యాప్ కూడా ఉండదు. కేవలం కొత్త Google payయాప్ మాత్రమే పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారానే లావాదేవీలు జరపొచ్చు.పాత Google యాప్ 2021 జనవరి నుంచి స్మార్ట్‌ఫోన్లలో పనిచేయదని Google ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీంతో పాటు ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఫీజ్ కూడా వసూలు చేస్తోంది Google. "మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే 13 బిజినెస్ డేస్ పడుతుంది. డెబిట్ కార్డ్ ట్రాన్స్‌ఫర్స్ ద్వారా వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీ డెబిట్ కార్డ్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే 1.5 శాతం ట్రాన్స్‌ఫర్ ఫీజ్ చెల్లించాలి" అని Google వెల్లడించింది. గతంలో డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండేవి కావు.


Google pay కొత్త యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు నవంబర్ మొదటి వారంలో రిలీజైంది. లోగో కూడా మారింది. అనకే కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఈ రీడిజైన్డ్ యాప్ అమెరికాలో లాంఛ్ అయింది. త్వరలోనే ఇండియాలో కొత్త Google pay యాప్ వచ్చే అవకాశముంది. ఇండియాలో కూడా కొత్త Google pay యాప్ వస్తే అమెరికాలో అందుబాటులో ఉన్న ఫీచర్సే ఇక్కడ కూడా ఉండే అవకాశముంది.

Thanks for reading Google Pay: Shock to Google Pay users ... those charges have to be paid

No comments:

Post a Comment