Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 7, 2020

E - Aadhaar card డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా .. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి


 E - Aadhaar card డౌన్లోడ్  చేసుకోవాలనుకుంటున్నారా .. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

ఆధార్ కార్డు ఇప్పుడు అన్నింటికి ఆధారంగా మారిపోయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) జారీచేసే ఈ కీలకమైన డాక్యుమెంట్ ను కేవలం ఐడీ ప్రూఫ్ గానే కాకుండా ఇన్నో రకాల సేవలకు ఉపయోగించుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కార్డు ఆధార్ లెటర్, ఈ-ఆధార్, పీవీసీ కార్డు వంటి మూడు రకాలుగా అందుబాటులో ఉంది. ప్రజలు తమకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ మూడింటిలో కెల్లా ఈ-ఆధార్లో ఎక్కువ సమాచారం ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కువ మంది ఈ-ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు.

స్వయంగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్ - https://uidai.gov.in/ through ద్వారా లేదా mAadhaar మొబైల్ యాప్ ద్వారా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఈ-ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ స్టెప్స్ను ఫాలో అవ్వండి.


ఆధార్ నెంబర్ ద్వారా.. 

స్టెప్ 1: ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ ను సందర్శించండి.


స్టెప్ 2: 'మై ఆధార్' ఆప్షన్ లోకి వెళ్లి 'డౌన్‌లోడ్ ఆధార్' పై క్లిక్ చేయండి.


స్టెప్ 3: 'ఐ హావ్' సెక్షన్ కింద ఉన్న 'ఆధార్' ఆప్షన్ను ఎంచుకోండి.


స్టెప్ 4: ఇప్పుడు, మీ 12- అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.


స్టెప్ 5: క్యాప్చా వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత, వన్ టైమ్ పాస్‌వర్ట్ పొందడానికి 'సెండ్ OTP' ఆప్షన్పై క్లిక్ చేయండి.


6: మీరు రిజిస్టర్ మొబైల్ కు అందుకున్న OTP ని ఎంటర్ చేయండి.


స్టెప్ 7: 'వెరిఫై అండ్ డౌన్‌లోడ్' ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ ఆధార్ ఎలక్ట్రానిక్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.


వర్చువల్ ఐడి ద్వారా..


దశ 1: https://uidai.gov.in/ ఆన్‌లైన్ పోర్టల్‌ను సందర్శించండి.


దశ 2: 'డౌన్‌లోడ్ ఆధార్' పై క్లిక్ చేయండి.


దశ 3: 'ఐ హావ్' సెక్షన్ కింద ఉన్న వర్చువల్ ఐడి ఆప్షన్ను ఎంచుకోండి.


దశ 4: వర్చువల్ ఐడి, పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యూరిటి కోడ్‌ను ఎంటర్ చేయండి.


దశ 5: OTP ని జెనరేట్ చేయడానికి 'సెండ్ OTP'పై క్లిక్ చేయండి.


దశ 6: OTPని ఎంటర్ చేసి, ఈ-ఆధార్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.


ఎన్ రోల్మెంట్ నెంబర్ (EID) ద్వారా..


దశ 1: UIDAI అధికారిక వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ ను సందర్శించండి. -


దశ 2: 'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.


దశ 3: క్రొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ, ఎన్ రోల్మెంట్ ID నెంబర్, 14 -అంకెల సమయం, తేదీ విలువలను ఎంటర్ చేయండి.


దశ 4: పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్ చా ఇమేజ్ కోడ్‌ను ఎంటర్ చేయండి.


దశ 5: OTP ను జెనరేట్ చేయడానికి 'రిక్వెస్ట్ OTP' పై క్లిక్ చేయండి.


దశ 7: 'నిర్ధారించండి' ఆప్షన్పై క్లిక్ చేయండి.


దశ 8: OTP ఎంటర్ చేసి, 'డౌన్‌లోడ్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ-ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

Thanks for reading E - Aadhaar card డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా .. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

No comments:

Post a Comment