Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 10, 2020

For sinus problems


 సైనస్​ సమస్యలకి చెక్​ పెట్టండిలా…



సైనస్​ సమస్య వచ్చిందంటే తరచూ జలుబుతో బాధపడాల్సి వస్తుంది. దానికి తోడు ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. విపరీతమైన తలనొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యలన్నింటికి చలి తోడైతే  సైనస్​  మరింత పెరుగుతుంది. అందుకే ఈ చలి కాలంలో సైనస్​తో బాధపడే వాళ్లు రిలీఫ్​ కోసం  యోగాని ఎంచుకోవచ్చు. ఈ ప్రాణాయామం చేస్తే   సైనస్​ సమస్యల్నించి రిలీఫ్​ అవ్వొచ్చు. మరి ఇదెలా వేయాలంటే..

ప్రాణాయామం

సైనస్​తో బాధపడే వాళ్లకి అలోమ– విలోమ ప్రాణాయామం క్షణాల్లో ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ ఆసనం కోసం ముందుగా వజ్రాసనంలో వెన్నెముకని నిటారుగా ఉంచి కూర్చోవాలి. కుడి చేతి  చూపుడు వేలు, మధ్య   వేలుని మడిచి  మిగిలిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ముందుగా కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోవాలి. ఇలా నాలుగు సెకన్లు చేశాక  బొటనవేలు తీసేసి కుడి ముక్కు నుంచి గాలిని బయటకు  నెమ్మదిగా వదలాలి.  తర్వాత  కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో గాలి వదలాలి. ఇలా ఐదు నుంచి పది నిమిషాలు   మార్చి, మార్చి చేయాలి.

లాభాలేంటి

ఈ ఆసనం వల్ల  జలుబు, దగ్గు నుంచి రిలీఫ్ దొరుకుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. సైనస్​ వల్ల వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది.  ఈ ప్రాణాయామం రెగ్యులర్​గా  చేస్తే  శరీరం యాక్టివ్​గా మారుతుంది కూడా.

Thanks for reading For sinus problems

No comments:

Post a Comment