Income Tax Returns దాఖలు చేసే గడువు పెంచిన కేంద్రం.తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే
2020-21 అసెస్‌మెంట్ ఈయర్‌కు Tax Returns దాఖలు చేసేందుకు గతంలో నవంబరు 30 వరకు గడువు ఉంది. దీన్ని ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మరో నెలరోజుల వరకు పొడిగించింది. పన్ను పరిధిలోకి వచ్చేవారు ఇప్పటికైనా డిసెంబర్ 31లోపు రిటర్న్ దాఖలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇన్‌కమ్Tax Returns ఫైల్ చేసే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2020-21 అసెస్‌మెంట్ ఈయర్‌కు Tax Returns దాఖలు చేసేందుకు గతంలో నవంబరు 30 వరకు గడువు ఉంది. దీన్ని ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మరో నెలరోజుల వరకు పొడిగించింది. పన్ను పరిధిలోకి వచ్చేవారు ఇప్పటికైనా డిసెంబర్ 31లోపు రిటర్న్ దాఖలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. COVID-19 మహమ్మారి కారణంగా Tax పేయర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని భావించి తుది గడువును మరోసారి పొడిగించినట్టు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా Returns దాఖలు చేయడానికి వార్షిక గడువు జూలై 31గా ఉంటుంది. కరోనా నేపథ్యంలో గతంలో దీన్ని నవంబర్ 30 వరకు పొడిగించారు. సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రక్రియను ముందుగానే పూర్తి చేయడం మంచిది. చివరి నిమిషం వరకు ఆలస్యం చేస్తే సాంకేతిక లోపాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
డిసెంబర్ 31 తుది గడువా?
2019-20 ఆర్థిక సంవత్సరంలో (అసెస్‌మెంట్ ఈయర్ 2020-21) ఆర్జించిన ఆదాయానికి అసెస్‌మెంట్ ఈయర్ చివరి వరకు, అంటే మార్చి 31, 2021 వరకు Tax Returns దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు రిటర్నులు దాఖలు చేయకపోతే సెక్షన్ 234 ప్రకారం జరిమానా విధిస్తారు. సాధారణంగా జులై31 వరకు గడువు ఉన్నప్పుడు Returns దాఖలు చేయకపోతే, డిసెంబర్ 31లోగా ఆలస్యమైన రిటర్న్‌లను సమర్పించవచ్చు. కానీ ఇందుకు రూ.5,000 ఫెనాల్టీ ఉంటుంది. డిసెంబరు31లోపు కూడా Returns ఫైల్ చేయకపోతే మార్చి 31 వరకు, రూ.10,000 జరిమానాతో పన్ను చెల్లించే అవకాశం ఉంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే, వారిపై అత్యధికంగా వెయ్యి రూపాయల వరకు ఫెనాల్టీ విధిస్తారని ఏకెఎం గ్లోబల్ టాక్స్ కన్సల్టెన్సీ సంస్థ డైరెక్టర్ సందీప్ సెహగల్ చెబుతున్నారు.
జరిమానాలు ఉంటాయి
ఈ అసెస్‌మెంట్ ఈయర్‌లో ఇప్పటికే సాధారణ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఈసారి కూడా రిటర్న్ ఫైల్ చేయకపోతే జనవరి 1, 2021 నుంచి మార్చి 31, 2021 మధ్య దాఖలు చేసే రిటర్న్‌లపై ఎంత ఫెనాల్టీ విధిస్తారో వేచి చూడాల్సిందే. జనవరి1 నుంచి మార్చి 31 వరకు దాఖలు చేసే లేట్ రిటర్న్స్‌పై విధించే జరిమానా(రూ.10,000 లేదా ఐదు లక్షల్లోపు ఆదాయం ఉంటే రూ.1000) మారకపోవచ్చని చార్టర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా చెబుతున్నారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేనందున ఈలోపే Returns ఫైల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగులపై ప్రభావం
నెలవారీ జీతం ఆర్జించే వ్యక్తులు సకాలంలో Tax చెల్లించకపోతే.. చెల్లించిన, చెల్లించాల్సిన పన్నుల మధ్య తేడాలు పెరుగుతాయి. Returns దాఖలు చేసే సమయంలో పాత పన్ను బకాయిలను కూడా క్లియర్ చేయాలి. దీంతో పాటు పన్ను బకాయిలపై సెక్షన్ 234 బి ప్రకారం వడ్డీ విధిస్తారు. Tax మొత్తాన్ని 2020 జూన్ 30 లేదా అంతకు ముందు వరకు సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్‌గా చెల్లిస్తే, దానిపై నెలకు 0.75 శాతం చొప్పున వడ్డీ విధిస్తారు. మిగిలిన భాగానికి నెలకు ఒక శాతం వడ్డీ విధిస్తారని క్లియర్‌టాక్స్ వ్యవస్థాపకుడు, CEO ఆర్చిత్ గుప్తా చెబుతున్నారు. సెల్ఫ్ అసెస్‌మెంట్ Tax రూ .1 లక్షకు మించి ఉంటే, అదనంగా నెలకు ఒక శాతం వడ్డీరేటు ఉంటుంది. 2020 ఆగస్టు 1 నుంచి Returns దాఖలు చేసే నెల వరకు ఈ వడ్డీని వసూలు చేస్తారు.ఆలస్యం చేస్తే ప్రమాదమే
చెల్లించవలసిన Tax ఎక్కువగా ఉంటే ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. ‘Tax పరిధిలోకి లోబడి ఆదాయం ఉండే వారు రిటర్న్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తారు. ఇది అంచనా వేసిన పన్నులో 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉండవచ్చు. చెల్లించాల్సిన Tax రూ .25 వేలకు మించి ఉంటే, దానికి జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష విధించే అవకాశం ఉంది’ అని సెహగల్ వివరిస్తున్నారు. ఒకవేళ మీ ఎంప్లాయర్ పన్నులను ఎక్కువగా డిడక్ట్ చేస్తే, దానికి కూడా తొందరపడాలి. మీకు Tax రిఫండ్ రావాల్సి ఉండి, ఆలస్యంగా Returns దాఖలు చేయడం వల్ల రిఫండ్ ప్రాసెస్ కూడా ఆలస్యమవుతుందని గుప్తా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో Tax రిఫండ్స్ ఆలస్యం కాకుండా చూసుకోవడం మంచిది.
Tax బెనిఫిట్స్‌పై ప్రభావం
లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లలో (ELSS) పెట్టుబడులు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ. వంటి వాటిపై సెక్షన్ 80 సి ప్రకారం వర్తించే ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాపారంలో నష్టాలు, క్యాపిటల్ లాస్ వంటివి ఎదురైనప్పుడు గడువు లోపు Tax Returns దాఖలు చేయకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.
Thanks for reading Income Tax Returns దాఖలు చేసే గడువు పెంచిన కేంద్రం.తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే
No comments:
Post a Comment