Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, November 27, 2020

Is the corona infected if there is no taste or smell?


 రుచి వాసన లేకపోతే కరోనా సోకినట్లేనా?

Is the corona infected if there is no taste or smell?

కరోనా వైరస్ ఎంటర్ అయ్యి పది నెలలు అవుతోంది. వ్యాక్సిన్ కబుర్లు ధైర్యాన్ని నింపుతున్నా..  చాపకింద నీరులా కరోనా ఇప్పటికీ చాలామందిని భయపెడుతూనే ఉంది. అయితే, కరోనా మీద రీసెంట్‌‌గా జరిపిన స్టడీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్‌‌ విషయాలు తెలిశాయి. ఒకవేళ రుచి, వాసన కోల్పోయి.. గ్యాస్ట్రిక్‌‌ ట్రబుల్‌‌తో ఇబ్బంది పడుతుంటే..ఇవి కరోనా లక్షణాలేనట!  పద్నాలుగు రోజుల వైరస్‌‌ సైకిల్‌‌లో  రెండో వారంలో ఈ లక్షణాలు కనపడతాయి. అయితే, ఈ టైమ్‌‌లో సివియర్‌‌‌‌ రెస్పిరేటరీ ఎటాక్‌‌ మాత్రం ఉండదు. పది నెలలు పరిశీలించి, స్టడీ చేసిన తర్వాత ఇండియన్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్స్‌‌ ఈ విషయాన్ని వెల్లడించారు.


కరోనాతో ఐసీయూలో ట్రీట్‌‌మెంట్ తీసుకున్నవాళ్లకు మాత్రం రుచి, వాసన లేకపోవడం లాంటి లక్షణాలు తొంభైశాతం కనపడవు. వాసన, రుచి కోల్పోయినవాళ్లకు ఉప్పు ఎక్కువ ఉప్పగా, నీళ్లు తియ్యగా అనిపిస్తాయి. పెర్‌‌‌‌ఫ్యూమ్‌‌ స్మెల్ చూస్తే.. అందులో ఆల్కహాల్ పార్ట్‌‌ మాత్రమే డామినేట్ చేస్తుంది. వాసన, రుచి తిరిగిరావడానికి  కనీసం మూడు నుంచి నాలుగు వారాలు పడుతుంది. ‘‘వాసన, రుచి లక్షణాలు కోల్పోవడం అనేది కరోనా వచ్చిందని చెప్పడానికి మంచి ఫ్రూఫ్‌‌. నలభైశాతం పేషెంట్స్‌‌లో ఇది వంద శాతం నిజమవుతోంది”అని నోయిడాకు చెందిన ఇంటర్‌‌‌‌వెన్షనల్‌‌ పల్మనాలజిస్ట్‌‌ అరుణ్‌‌ లఖన్‌‌పాల్‌‌ చెప్పాడు. అరుణ్ ఎంతో మంది పేషెంట్స్‌‌ని కరోనా నుంచి కాపాడాడు. మెడంటా కోవిడ్–19 పేరుతో జరిగిన ఈ స్టడీని అరుణ్‌‌ లీడ్ చేశాడు.

ఎందుకు కోల్పోతారు?

కరోనా వస్తే రుచి, వాసన ఎందుకు కోల్పోతారు? అంటే ఈ ప్రశ్నకు ఇప్పటికీ కరెక్ట్‌‌ సమాధానం కనుక్కోలేకపోయారు రీసెర్చర్లు.  కానీ, కేవలం కరోనా వైరస్ వల్లనే కాదు..రైనిటిస్‌‌, సైనసైటిస్‌‌, బ్రెయిన్ ట్యూమర్స్‌‌, డయేరియా మెడిసిన్స్ వాడటం, ఛాతి, పొత్తికడుపు ఇన్‌‌ఫెక్షన్స్ వల్ల కూడా రుచి వాసన, కోల్పోతారు. ‘ ఒక్కోసారి వాసన కోల్పోవడం వల్ల రుచి కూడా కోల్పోతారు. ఎందుకంటే, ఈ రెండింటికి లింక్ ఉంటుంది. కరోనా వైరస్‌‌ రుచి, వాసన తాలూకు కణాలూ, నరాలపై  ప్రభావం చూపడం వల్ల కూడా ఇలా జరగొచ్చు.  పేషెంట్‌‌కి కోవిడ్‌‌ నెగెటివ్ వచ్చిన రెండు, మూడు వారాలకు తిరిగి రుచి, వాసన తెలుస్తుంది”అని  లఖన్‌‌పాల్ అన్నాడు.  ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటపడింది. ఎక్కువ శాతం యూత్‌‌లోనే రుచి, వాసన కోల్పోవడం ఉందట!  ‘సడెన్‌‌గా రుచి, వాసన కోల్పోతే వెంటనే వాళ్లు ఐసోలేట్ అవ్వాలి. ఎందుకంటే, వీళ్ల వల్ల ఇతరులకు కరోనా సోకే ఛాన్స్ చాలా ఎక్కువ. బాడీ టెంపరేచర్, ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

ఆక్సిజన్ లెవల్స్ తగ్గినా జ్వరం ఉన్నా ఇంట్లోనే ఉండి డాక్టర్‌‌‌‌ సలహా తీసుకోవాలి. మేం ఇంకా కరోనా వైరస్‌‌ తాలూకు గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం’ అని లఖన్‌‌పాల్ ముగించాడు.

ఐసీయూ అవసరం లేదు

‘అవును, రుచి, వాసన కోల్పోయిన పేషెంట్లలో చాలామందిలో సివియర్ డిసీజ్ లేదు.  వీళ్లకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు. వీళ్లు హస్పిటల్‌కి వచ్చి ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకోనవసరం లేదు. ఇవన్నీ మేం క్లియర్‌‌గా స్టడీ చేసి తెలుసుకున్నాం’ అని మెడంటా కోవిడ్‌–19 టీంమెంబర్‌‌గా పని చేసిన డాక్టర్ సుశీల కటారియా చెప్పింది.  ‘కాబట్టి, రుచి, వాసన కోల్పోవడం అనేది మంచి సంకేతమే! ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్‌ మరింత కేర్‌‌ఫుల్‌గా ఉంటాడు. మంచి ఫుడ్‌ తీసుకుంటాడు’ అని కూడా చెప్పిందామె.

Thanks for reading Is the corona infected if there is no taste or smell?

No comments:

Post a Comment