Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, November 12, 2020

Prevent pneumonia in winter ..


 చలికాలంలో న్యుమోనియాను అడ్డుకోండిలా..

చలికాలంలో తీవ్రమయ్యే ఆరోగ్య  సమస్యల్లో న్యుమోనియా ఒకటి. చలి తీవ్రత పెరిగే కొద్దీ జబ్బు తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్న వాళ్లు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడతారు.  కారణం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ముదరడమే. ఈ ఇన్ఫెక్షన్ ఇతరులకు అంటుకునే ఛాన్స్ ఎక్కువ. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలోనూ న్యుమోనియా ప్రమాదకరంగా మారింది. అందుకే లక్షణాలను ముందే గుర్తించాలి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుందంటున్నారు డాక్టర్లు. సరైన టైంలో సరైన కేర్ తీసుకోవడం వల్ల న్యుమోనియాను కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు.

మన ఊపిరితిత్తులకి వచ్చే ఇన్ఫెక్షనే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో వైరస్ తిష్టవేయడం వల్ల ఇది వస్తుంది. న్యుమోనియా లక్షణాల్లో జ్వరం, పొడిదగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. అయితే వైరస్ శరీరంలో ఉండే తీవ్రతను బట్టి మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే వైరస్ శరీరంలోకి ఎంటరైందో అప్పటి నుంచి సైలెంట్​గా సెల్స్​ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అంటే పైకి కనిపించకుండానే ఊపిరితిత్తులు న్యుమోనియా వల్ల ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆ తరువాత ఒక్కొక్కటిగా జలుబు, జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, ఛాతి నొప్పి, శ్వాస ఇబ్బందులు, కఫం పేరుకుపోవడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలు బయటపడతాయి.

ఆ నొప్పితో గుర్తించొచ్చు

ముక్కులో లైట్‌‌గా నొప్పితో న్యుమోనియా మొదలవుతుంది. అయితే దీన్ని అంతగా ఎవరూ పట్టించుకోరు. కానీ చలికాలంలో ఇలా ముక్కు లోపల నొప్పిలా అనిపిస్తే జాగ్రత్తపడాలి. ఒళ్లునొప్పులు, లేచి నిలబడితే కళ్లు తిరగడం. చిన్న చిన్న శబ్దాలకు కూడా తలనొప్పి రావడం. ప్రతీదానికి చిరాకుపడటం వంటి ఇబ్బందులుంటాయి. వీటిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే కేర్ తీసుకోవాలి.

ఒకరి నుంచి ఒకరికి

న్యుమోనియాను కంట్రోల్ చేయడంలో శరీరంలోని యాంటీబాడీస్, తెల్లరక్తకణాలు  కీలకం. శరీరంలోకి ప్రవేశించిన క్రిముల సంఖ్య ఎక్కువగా ఉన్నా, వాటికి తీవ్రత ఎక్కువగా ఉన్నా  ఇవి రక్షణ కలిగిస్తాయి. అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో వీటి దాడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలతోనే ఇతరులకు ఈ జబ్బు ఈజీగా అంటుకుంటుంది. అందుకే న్యుమోనియా లక్షణాలున్నవారు మాస్క్ పెట్టుకోవడం, తరచూ చేతులు కడగడం వల్ల ఇతరులకు వ్యాపించకుండా కంట్రోల్ చేయొచ్చు.

ఇమ్యూనిటీ తగ్గితేనే..

శరీరంలో ఇమ్యూనిటీ తగ్గితేనే వైరస్ తీవ్రత పెరుగుతుంది. యాంటీబాడీస్, తెల్లరక్తకణాలు శరీరంలో ఎక్కువగా ఉండాలన్నా ఇమ్యూనిటీ పెరగాలి. దానికి ప్రతిరోజు బలమైన తిండి తినాలి. ముఖ్యంగా చలికాలంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలి. సిట్రస్ ఫుడ్​ఎక్కువగా తీసుకోవడం వల్ల న్యుమోనియాకు అడ్డుకట్ట వేయొచ్చు.

హోమ్ రెమెడీస్

  1. తరచూ గోరువెచ్చని ఉప్పు నీళ్ళతో పుక్కిలించడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. కఫం ఉంటే క్లియర్ అవుతుంది.
  2. పెప్పర్‌‌‌‌మెంట్, లవంగం, దాల్చినచెక్క బెరడు, యూకలిప్టస్, థైమ్ వంటి కొన్ని రకాల నూనెలు న్యుమోనియాను తగ్గిస్తాయి.  వేడి నీళ్లలో నాలుగైదు చుక్కలు నూనె వేసి ఆవిరి పడితే శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయి.
  3. జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది. టీ తాగాలని అనుకున్నప్పుడల్లా ఈ టీలు ప్రిఫర్ చేస్తే బెటర్.
  4. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవాలి. తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియాలు న్యుమోనియా లక్షణాలను తగ్గించడానికి సాయపడతాయి.
  5. బలాన్నిచ్చే  తిండితో పాటు విటమిన్‌‌–సి, విటమిన్‌‌–డి ఉండే పళ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. దీనివల్ల శరీరానికి వైరస్‌‌ను ఎదుర్కొనే శక్తి అందుతుంది.

రెండు రకాలు

సీజన్ మారినా, వైరస్‌‌లు చుట్టూ పెరుగుతున్నా  న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది.  దీన్ని ముందే గుర్తించి కంట్రోల్ చేస్తే బయటపడొచ్చు. కానీ వ్యాధి ముదిరితే చాలా ప్రమాదం.  అప్పటివరకూ ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్  ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా గుండె, మూత్రపిండాలు, కాలేయానికి చేరే ప్రమాదం ఉంది. ఇందులో రెండు రకాలున్నాయి. అయితే అన్ని రకాల న్యుమోనియాకు ఒకే చికిత్స ఉండదు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన నిమ్మును తొలగిస్తే న్యుమోనియా నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదంటే బ్రీతింగ్ అందక మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే ముందే జాగ్రత్తపడాలి. నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలవాలి.

– డాక్టర్ ఎస్.ఎ రఫి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

Thanks for reading Prevent pneumonia in winter ..

No comments:

Post a Comment