Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, November 12, 2020

We will soon fulfill all the promises made in the Prajasankalpayatra: CM Jagan


సిపిఎస్ విధానం త్వరలో ఎత్తివేత ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేరుస్తాం  : సిఎం జగన్

 విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భద్రతకు , వారికి గతం లో మాదిరిగానే పెన్షన్లు చెల్లింపు , పీఆర్సీ ఇతర హమీలకు కట్టుబడి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేసారు ఎన్నికల సమయంలోను , ప్రజాసం కల్పయాత్ర సందర్భంలోను తాము ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానంనికి అనుగుణంగా సీపీఎస్ విధానాన్ని ఎత్తివేస్తా  మని పునరుద్ఘాటించారు . కాంట్రిబ్యూటరీ పింఛను పథకం , కాంట్రాక్ట్ ఉద్యోగు కొనసాగింపు , ఆ ఉద్యోగుల ప్రయోజనాలు తదితరంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం తన వ్యక్తిగత కార్యాలయంలో సమీక్షను నిర్వహించారు . సీపీఎస్ పై ఆయన ఉన్నతస్థాయి అధికారులనుంచి కీలకంశాలను అడిగి తెలుసుకున్నారు . ఈ విధానాన్ని ఎత్తివేస్తామన్న తమ వాగ్దానం నేరవేరే దిశలో చర్యలు తీసుకోవాలన్నారు . ఈ సందర్భంగా కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమావేశంలో అధికారులు ఆయనకు వివరించారు . సిపీఎస్ పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం , సీఎస్ నేతృ త్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు , అంతకు ముందు ఇచ్చిన టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించాలని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు . రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు , గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు , యూనివర్శిటీలు , విద్యా సంస్థల్లో లక్ష 98 వేల 221 మంది సీపీఎస్లో ఉన్నారని , వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు లక్ష 8 వేల 705 కాగా , గ్రాంట్ ఇన్ ఎయిడ్ క్రింద 3 వేల 295 మంది ఉండగా , మిగిలిన 16 వేల 221 మంది యూనివర్సి టీలు , విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు . వారికి ఏ పెన్షన్ విధా నాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం ఆవు తుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు . వాటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడ ఆ జాబితాలో చేర్చి , సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు .  కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలురూపొందించాలని ఆయన అధికారులను ఆదే శించారు.ఏ వాగ్దానమైనా ప్రభుత్వం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేసి తీరుతుందన్నారు . సీపీఎస్ విషయంలో సాంకేతికంశాలు , ఇతరం శాలను లోతుగా అధ్యయనం చేయాలన్నారు . ఈ విషయంలో ప్రభుత్వంపై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలన్నారు . ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు . ఈ సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ , రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు , సాధారణ పరి పాలనా శాఖ కార్యదర్శి శశిభూషణ కుమార్ , పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్ , పురపాలక పరిపాలన శాఖ కమి షనర్ విజయకుమార్ , ప్రభుత్వ ప్రధాన సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి , వివిధ శాఖల అది కారులు హాజరయ్యారు .

Thanks for reading We will soon fulfill all the promises made in the Prajasankalpayatra: CM Jagan

No comments:

Post a Comment