Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 18, 2020

Supreme Court orders on pending salaries? Pay pending salaries by January 15!


పెండింగు జీతాలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ? 

 జనవరి 15 లోగా పెండింగు జీతాలు ఇచ్చెయ్యండి ! 

 ఆ తర్వాత వడ్డీ విషయం తేలుస్తాం 




 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కారణంగా కోత విధించిన రెండు నెలల పెండింగు జీతాలు జనవరి 15 లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిసింది . అవి చెల్లించి వస్తే 12 శాతం వడ్డీ మాఫీ విషయంపై అప్పుడు తమ నిర్ణయం చెబుతామని పేర్కొన్నట్టు సమాచారం . ప్రాథమికంగా విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి . రాష్ట్రంలో ఉద్యోగులకు కరోనా కారణంగా మార్చి , ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలు సగం మొత్తం ప్రభుత్వం నిలిపివేసింది . పెన్షసర్లకు ఒక నెల సగం పెన్షన్ నిలిపివేసింది . దీనిపై ఆప్పట్లో ఒక విశ్రాంత జిల్లా మేజిస్ట్రేట్ హైకోర్టును ఆశ్రయించగా పెండింగు జీతాలు రెండు నెలల్లోగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది . అక్టోబర్ 12 తో ఆ గడువు తీరిపోయింది . ఈ వడ్డీ చెల్లించలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది . అది గురువారం విచారణకు వచ్చినట్లు సమాచారం . పెండింగు జీతాలు చెల్లించగలం కానీ , వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నట్లు సమాచారం . ఎప్పటిలోగా పెండింగు జీతాలు చెల్లించగలరని న్యాయస్థానం ప్రశ్నించిందని తెలిసింది . రెండు నెలల్లోగా పెండింగు మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పగా జనవరి 15 లోపు పెండింగు జీతాలు ఇచ్చెయ్యాలని సుప్రీంకోర్టు సూచించింది . ఆ మొత్తాలు చెల్లించిన తర్వాత వడ్డీ విషయంలో తమ నిర్ణయం చెబుతామని పేర్కొన్నట్లు సమాచారం . ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది . సుప్రీంకోర్టు ఆర్డరు కాపీ అందిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది .

Thanks for reading Supreme Court orders on pending salaries? Pay pending salaries by January 15!

No comments:

Post a Comment