వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మందికి టీకా
కరోనా టీకా సరఫరా కోసం అమెరికా కట్టుదిట్టమైన ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మందికి టీకా అందించేలా కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ప్రధాన సలహాదారుడు మోన్సెఫ్ స్లాయీ వెల్లడించారు. వారం రోజుల్లోగా కనీసం ఒక్క టీకాకైనా అత్యవసర వినియోగానికి ఆమోదం లభిస్తుందని అన్నారు.
2021 ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తామని అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఏర్పాటు చేసిన 'ఆపరేషన్ వార్ప్ స్పీడ్' ప్రధాన సలహాదారుడు మోన్సెఫ్ స్లాయీ పేర్కొన్నారు. వైరస్ ముప్పు అధికంగా ఉన్న జనాభాకు ముందుగా టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 10 లేదా 11 నాటికి కనీసం ఒక్క టీకాకైనా అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయని అంచనా వేశారు.
జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేస్తున్న టీకాపై ఆశలు పెట్టుకున్నట్లు చెప్పారు మోన్సెఫ్. జాన్సన్ సింగిల్ డోసు టీకా వల్ల ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
24 గంటల్లో సరఫరా
మరోవైపు, అమెరికా ఎఫ్డీఏ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఆమోదం పొందిన 24 గంటల్లోనే వ్యాక్సిన్ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆపరేషన్ వార్ప్ స్పీడ్ సీఈఓ జనరల్ గుస్టావే పెర్నా స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థల ద్వారా టీకా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఫైజర్, మోడెర్నా టీకా స్వీకరించే ప్రజలు రెండో డోసు కోసం రావడం చాలా ముఖ్యమని అన్నారు.
Thanks for reading 10 crore people will be vaccinated by the end of February next year
No comments:
Post a Comment