Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 3, 2020

Protect your feet like this


 పాదాలను ఇలా రక్షించుకోండి

 ఇరవై ఏళ్లు పైబడితే చాలు చాలామందికి పాదాలకు సంబంధించిన ఏదో ఒక సమస్య వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. అందువల్ల పాదాల ఆరోగ్యం కాపాడుకోవడం తప్పని సరి అవుతోంది. వాటిని ఇలా కొంచెం పైలంగా చూసుకుంటే చాలు..

షూ ఎలా ఉండాలి?

పాదాలను షూలు చాలా వరకూ రక్షిస్తాయి. అందుకే మడమ కింద కాస్త మెత్తగా ఉండే షూ ఎన్నుకుంటే బాగుంటుంది. వేళ్లు లోపలకు నొక్కుకుపోకుండా ముందు భాగంలో తగినంత స్థలం ఉండేట్టు చూసుకోవాలి. వాటిని కొనేముందు ఒకసారి వేసుకుని పరీక్షించి మరీ కొంటే మంచిది. మడాలు మరీ ఎత్తుగా ఉండకుండా కూడా చూసుకోండి.

ఎత్తు మడాలు

వీటితో పాదాల నొప్పే కాదు, వేళ్ల దగ్గర బొబ్బలు రావచ్చు. అవి వంగిపోవడం, మడమ నుంచి వేళ్ల వరకూ విస్తరించి ఉండే కణజాలం పొర వాయడం జరుగుతుంది. గోళ్లు లోపలికి పెరగడం వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.

వ్యాయామం

రోజూ కొద్దిపాటి వ్యాయామం చేస్తే పాదాల ఆరోగ్యం మెరుగవుతుంది. నడక, పరుగు, సైకిల్‍ తొక్కడం వంటి పనులు కండరాలు తేలికగా కదలడానికి, బలం అవడానికి, రక్తప్రసరణ మెరుగవడానికి సహాయపడతాయి.

శుభ్రం

సమయం దొరికినప్పుడల్లా పాదాలను కొద్దిగా సాగదీయండి. ప్రతిరోజూ సబ్బు, గోరువెచ్చటి నీటితో పాదాలనుశుభ్రం చేయాలి. వేళ్ల మధ్యలో తడిలేకుండా తుడవాలి. అలాచేస్తే ఇన్ఫెక్షన్లు రావు.

Thanks for reading Protect your feet like this

No comments:

Post a Comment