Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 4, 2020

Sunday Story Time- Guidelines


 సండే స్టోరీ టైమ్-మార్గదర్శకాలు

Sunday Story Time- Guidelines


★ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 3 నుండి 9 తరగతుల విద్యార్థులకు పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు we love reading అనే పఠన ప్రచారాన్ని పాఠశాల విద్యాశాఖ, ఆం ప్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది


★ విద్యార్థులలో మరియు ఉపాధ్యాయులలో కూడా నిరంతర పఠనం అలవాటుగా చేయాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం


★ పాఠశాల ఆధారిత పఠన కృత్యాలతో పాటు ఖాళీ సమయాన్ని సద్వినియోగ పరచాలనే ఉద్దేశ్యంతో sunday story time అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించడమైనది


★ లైబ్రరియన్ లతో , గ్రామ సచివాలయానికి చెందిన విద్య & సంక్షేమ సహాయకులు, పఠన వాలంటీర్ల  సహకారాలతో... ప్రతి ఆదివారం పిల్లలు   పబ్లిక్ లైబ్రరీలలో/కాలనీలలో/వీధుల్లో/వార్డులలో సమావేశమై పఠన కృత్యాలను నిర్వహించవలెను


★ sunday story time కి సంబంధించి పై వారితో ప్రధానోపాధ్యాయులు ఒక సమావేశం ఏర్పాటు చేయాలి


★ ది.05.12.2020 న పైన పేర్కొనిన వారందరూ పబ్లిక్ లైబ్రరీని మరియు సామూహిక పఠనా కేంద్రాల ప్రాంతాలను గుర్తించి, సందర్శించి...ఉదయం 10 గంటలకు విద్యార్థులను కూడా ఆహ్వానించి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సామూహిక పఠనం చేయించాలి


★ ది.06.12.2020 ఆదివారం పైన పేర్కొనిన వారందరూ కలసి పాఠశాల లైబ్రరీ నుండి CLIL పుస్తకాలు/NBT పుస్తకాలు/CBT పుస్తకాలు ఏదైనా ఒక పుస్తకం ఎంపికచేసి సరిపోవు సంఖ్యలో సేకరించాలి


★ ది.06.12.2020 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పై వారందరూ కలసి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి


★ ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు పై వారందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించిన పిదప... విద్యార్థులచే సొంతగా పఠనం చేయించాలి


★ ఈ సామూహిక పఠన కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు , విద్యావేత్తలు , సీనియర్ సిటిజన్ లు , విద్యార్థుల సేవలను వినియోగించుకోవలెను. వీరిలో ఒకరిని ఆదివారంనకు  పఠన వాలంటీర్ గా వ్యవహరించేలా చూడాలి


★ ప్రతి ఆదివారం అన్ని లైబ్రరీలలో , అన్ని అవాస ప్రాంతాలలో 3 నుండి 9 తరగతుల విద్యార్థులను ఆహ్వానించి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి


★ పై వారందరూ కలసి sunday story time కి ముందురోజున సామూహిక పఠనా  కార్యక్రమం యొక్క సంసిద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి


★ అందరు తల్లిదండ్రులను , విద్యార్థులను సామూహిక పఠనా కార్యక్రమానికి హాజరయ్యేలా వాట్సాప్/ఫోన్ కాల్/వ్యక్తిగత ఆహ్వానం ల ద్వారా ఆహ్వానించాలి


★ స్థానికంగా ఆసక్తి గల వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు


★ సామూహిక పఠనా కార్యక్రమానికి సరిపోవు సంఖ్యలో పుస్తకాలు సిద్ధంగా సేకరించి ఉంచుకోవాలి


★ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలి


★ విద్య & సంక్షేమ సహాయకుల సేవలు వినియోగించుకునేందుకు గ్రామ సచివాలయాల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

Thanks for reading Sunday Story Time- Guidelines

No comments:

Post a Comment