Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 27, 2020

Surveillance on Ammavodi '


 అమ్మ ఒడి'పై నిఘా

♦నేడు పేరెంట్స్ కమిటీల భేటీలు

♦ఉపాధ్యాయుడి బిడ్డకు లబ్ధిపై ప్రభుత్వం సీరియస్

♦" అనర్హుల విషయంలో జాగ్రత్త: విద్యాశాఖ  



 అమ్మ ఒడి పథకంపై సోమ వారం పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల సమావే శాలు నిర్వహించి అర్హుల జాబితాలను తేల్చాలని పాఠ శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అన రుల వివరాలు బహిర్గతం కాకుండా ప్రధానోపాధ్యా యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుది జాబితాలకు బుధవారం గ్రామ సభలు నిర్వహించి ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. అనంతరం ఆ జాబితాలను గురువారం నాటికి ఎంఈవోలకు అందజే యాలని పేర్కొంది. కాగా, అనర్హుల విషయంలో ప్రధా నోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు తీసుకోవల సిన జాగ్రత్తపై పలు హెచ్చరికలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం సర్క్యులర్ జారీ చేశారు. ఓ జిల్లాలో ఉపాధ్యాయుడు తన బిడ్డకు అమ్మ ఒడి లబ్ధి చేకూరేలా అక్రమాలకు పాల్పడినట్టు అందులో వివరించారు. విద్యార్థి తల్లి ఆధార్ కార్డును జత చేయకుండా, ఆ ఉపాధ్యాయుడు తన తల్లి ఆధార్ కార్డును జత చేసి లబ్ది పొందినట్లు పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో ఉపా ధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయించినట్లు వివరించారు. ఒక్క అనర్హుడు కూడా లబ్ధి పొందకుండా జాగ్రత్తలు పాటిం చాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల వైనే ఉందని డైరెక్టర్ స్పష్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగుల పిల్లల విషయంలో ఆప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పది వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు పైబడి ఆదాయమున్న వారిని స్పష్టంగా అనర్హులుగా గుర్తించి ఏరివేయాలని పేర్కొ న్నారు. అయినా ఏమార్చి లబ్ది పొందితే వారిని ఉద్యో గాల నుంచి తొలగించి క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ స్పష్టం చేశారు.


Thanks for reading Surveillance on Ammavodi '

No comments:

Post a Comment