Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 3, 2021

Bird Flu Alert: Central alert for states .. Bird flu may spread to humans .. Several orders issued


 Bird Flu Alert : రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్ .. బర్డ్ ఫ్లూ మనుషులకూ వ్యాప్తి చెందే అవకాశం..పలు ఆదేశాలు జారీ



Bird Flu Alert: మళ్లీ బర్డ్‌ప్లూ మొదలైంది. రాజస్థాన్‌లో వందల సంఖ్యలో కాకులు చనిపోడానికి కారణం బర్డ్‌ఫ్లూయే అని కేంద్రం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. రాజస్థాన్‌లోనే కాకుండా పక్షుల మరణాలు సంభవించిన రాష్ట్రాలకు అలెర్ట్‌గా ఉండాలని కేంద్రం సూచించింది. మధ్యప్రదేశ్‌లోనూ కాకులు చనిపోయినట్లు స్థానిక అధికారులు గుర్తించారు.


రాజస్థాన్‌లో ఇప్పటి వరకూ కొన్ని వందల సంఖ్యలో కాకులు చనిపోయాయి. మొత్తంగా కోటాలో 47, ఝలవర్‌లో 100, బరన్‌లో 72 కాకులు చనిపోయాయని రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. కాకులతోపాటు కింగ్‌ఫిషర్ పక్షులు కూడా చనిపోయినట్లు నిర్ధారించారు. రాజస్థాన్‌లో కాకులు చనిపోయిన ప్రాంతానికి పరిసర ప్రాంతాలలో ఫ్లూ లక్షణాలు ఉన్న వారిని గుర్తించే పనిలో ఉన్నారు స్థానిక అధికారులు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనూ డేలీ కళాశాలలో 50 కాకులు ఇలాగే మృత్యువాత పడ్డాయి. వాటిలోనూ హెచ్‌5ఎన్‌8 వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఫ్లూ లక్షణాలు ఉన్న వారి నుంచి స్వాబ్ శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఇండోర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పూర్ణిమా గడారియా తెలిపారు. ఆ చుట్టుపక్కల జలుబు, దగ్గు, జ్వరంలాంటి సింటమ్స్ ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తాయి కాబట్టి.. అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది.

Thanks for reading Bird Flu Alert: Central alert for states .. Bird flu may spread to humans .. Several orders issued

No comments:

Post a Comment