Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 3, 2021

How can those who aim to get a government job in the new year move forward on the path to achieving that goal ...?


 కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎలా ముందుకు సాగాలి ...?

'కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల'నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి! సర్కారీ కొలువు ఆశించేవారి సంఖ్య మన దేశంలో చాలా ఎక్కువ. అయితే ఈ అవకాశాలు పరిమితమైనవి. నూతన సంవత్సరంలో యూపీఎస్‌సీ, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థలు ప్రకటించే నోటిఫికేషన్లలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని యువత సహజంగానే ప్రయత్నిస్తుంది. ఆ దిశలో తీర్మానాలూ చేసుకుంటారు. ఈ లక్ష్యసాధనకు దృఢంగా నిలబడాలంటే.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ తరహా ఆలోచనా విధానం పెంచుకోవాలి?

అకడమిక్‌ పరీక్షల్లో కష్టపడిన వారందరూ స్కోర్లు సాధించి విజేతలవుతారు. పోటీ పరీక్షల్లో విజేతలు తక్కువ; పరాజితులే ఎక్కువ. పోటీ పరీక్షల్లో చదివే విధానం అకడమిక్‌ పరీక్షల్లో చదివే విధానం కంటే చాలా భిన్నమైంది. ఏ పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నాను, దాన్ని నిర్వహించే సంస్థ, ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ లక్ష్యాలు ఏమిటి? అభ్యర్థుల నుంచి వారు ఆశిస్తున్నది ఏమిటి? మొదలైనవి దృష్టిలో పెట్టుకుని సన్నద్ధతను అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే పరీక్షకు అవసరమైన రీతిలో తయారవుతారు. పోటీ పరీక్షల్లో సిలబస్‌ అనేది నామమాత్రం. ఏయే సందర్భాల్లో సిలబస్‌కి బయట వెళ్లి మరీ ప్రశ్నలడుగుతారనేది అంచనా వేయగలిగినప్పుడు విజయాన్ని సాధించటానికి మారం సుగమమవుతుంది. ఏ విషయాన్ని పరిహరించాలి, దేన్ని అదనంగా చదవాలి అనే అవగాహన పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యం. సిలబసులోని ఏ విషయాల్లో కనిష్ఠ, మధ్యమ, గరిష్ఠ స్థాయుల్లో ప్రిపరేషన్‌ ఉండాలో నిర్ణయించుకోవడమూ విజయానికి దారి తీసే అంశమే.

సుదీర్ఘ పోరుకు సంసిద్ధత

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ లాంటి సంస్థలు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాయి. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ రంగంలో ఉద్యోగాల ఖాళీలను బట్టి మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు మాత్రం పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారు.అయితే రాష్ట్రస్థాయిలో నిర్వహించే అనేక పరీక్షలు నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లవు. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్ల ద్వారా వచ్చే గ్రూప్‌-1, గ్రూప్‌-2 మొదలైన వాటితో పాటు ఉపాధ్యాయ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మొదలైన ఉద్యోగాల పరీక్షలు ఏమాత్రం కచ్చితత్వం లేనివి. కొన్నికొన్ని సందర్భాల్లో వాటికోసం నాలుగు నుంచి ఆరు సంవత్సరాలపాటు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అది కూడా కచ్చితత్వం ఉండదు. కోర్టు కేసులు, ఇతరత్రా ఉపద్రవాలను బట్టి సుదీర్ఘ కాలం ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇలాంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు తమ తక్షణ అవసరాలేమిటో స్పష్టంగా నిర్వహించుకుని వాటికి అనుగుణంగా ఈ ఉద్యోగాలను పొందగలమా లేదా అని విశ్లేషించుకోవాలి. సుదీర్ఘ కాలం పోటీ పరీక్షల కోసం వెచ్చించలేనివారు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడమే సముచితం.

నిరంతర ప్రేరణ

పోటీ పరీక్షల్లో కాలం గడిచే కొద్దీ అనేక సవాళ్ల వల్ల ప్రేరణ కోల్పోయి రంగం నుంచి విరమించే వారి శాతం చాలా ఎక్కువ. పోటీ పరీక్షల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతుండటం కూడా అంతే ముఖ్యం. విజయాలను సాధించిన వ్యక్తులు అనుసరించిన మార్గాలను పరిశీలించటం, విజయం సాధించాక వచ్చే ఫలితాలను ఊహించుకోవటం, మంచి స్నేహితులుండే బృందంలో సభ్యులు కావటం, యోగా, ప్రాణాయామం లాంటివి అనుసరించడం, ప్రతికూల ధోరణితో ఉండేవారికి దూరంగా ఉండటం, లాంటి మెలకువల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేరణ పొందుతూ ఉంటే ఆశించిన ఫలితాలు దగ్గరవుతాయి.

మీకుందా ప్లాన్‌- బి?

'అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతే ఏమిటి'? అనే ప్రశ్న వల్ల అభ్యర్థులు చాలా సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల విజయావకాశాలను తగ్గించుకుంటారు. 'పోటీ పరీక్షల్లో సహజంగా అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, అదే జీవన్మరణ సమస్య' అని చెబుతూ ఉంటారు. కానీ అది అంత సరైన ఆలోచన కాదు. ఎప్పుడైతే జీవన్మరణ సమస్య అనుకుంటామో రెట్టించి చదువుతామేమో కానీ అంతకు పదిరెట్లు ఒత్తిడికి గురవడం వల్ల నష్టమే అధికం. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని భావించి అప్పుడేం చెయ్యాలో ప్లాన్‌- బి ఉంటే అభ్యర్థులు చాలా ఉపశమనం పొందుతారు. ఫలితంగా విజయావకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. అయితే...'ప్లాన్‌-బి ఉంది కదా' అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే మాత్రం అసలుకే మోసం వస్తుంది సుమా!

Thanks for reading How can those who aim to get a government job in the new year move forward on the path to achieving that goal ...?

No comments:

Post a Comment