Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 4, 2021

Government jobs with Inter qualification


ఇంటర్ అర్హతతో  ప్రభుత్వ ఉద్యోగం .. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ ...



 మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకునే వారికి రక్షణ రంగం చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ఇందుకోసం యూపీఎస్‌సి ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. 2021 సంవత్సరానికి తాజాగా మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది.

దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 2 జనవరి 2022 నుంచి ప్రారంభమయ్యే 147వ కోర్సులో, 109వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. అయితే ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించనున్నారు.


మొత్తం ఖాళీలు: 400

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టుల- 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏర్ ఫోర్స్ 120) ఉన్నాయి.

ఇందులో గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు- 28 ఉన్నాయి.

నేవల్ అకాడమీ (10 + 2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ) ఖాళీలు- 30


అర్హతలు: అవివాహితులైన బాలురు మాత్రమే దీనికి అర్హులు. ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ కూడా అర్హులే.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు 2 జులై, 2002కి ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 1 జులై, 2005కి తర్వాత పుట్టి ఉండకూడదు. నిర్ణీత శారీరక ప్రమాణాలను తప్పనిసరి కలిగి ఉండాలి.


ఎంపిక ప్రక్రియ:

1) రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ తరహా)

2) ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్


రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ తేదీలు, కేటాయించిన ఎస్ఎస్‌బి సెంటర్ల వివరాల కోసం ఈ కింది వెబ్ సైట్లను పరిశీలించాలి.


కోర్సులకు ఎంపికైన తర్వాత: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ఉచితంగా చదవచ్చు.


శిక్షణ: అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్‌ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు.


అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అప్పుడు వేతనం నెలకు రూ.లక్ష పైనే ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు, అలవెన్సులు అందుతాయి.


ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది. రెండేళ్లు, ఆరేళ్లు, పదమూడేళ్ల సర్వీస్ తో ప్రమోషన్లు పొందవచ్చు.


దరఖాస్తుకు చివరి తేదీ: 19 జనవరి 2021

ఆన్ లైన్ రాత పరీక్ష: 18 ఏప్రిల్ 2021న జరుగుతుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం

వెబ్ సైట్: https://upsconline.nic.in/

Thanks for reading Government jobs with Inter qualification

No comments:

Post a Comment