Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 9, 2021

Vaccine distribution from 16th January


దేశంలో జనవరి 16 నుంచి టీకా పంపిణీ ..వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Vaccine distribution from 16th January

దిల్లీ: కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు పేర్కొంది. ‘వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించాం’ అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 

దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది. కేబినెట్‌ సెక్రటరీ, పీఎం ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ సన్నాహాల గురించి ప్రధాని అధికారులను అడిగి తెలుసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం నిన్న దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ ఫలితాల ఆధారంగా టీకా పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో 2,24,190 వైరస్‌ క్రియాశీల కేసులున్నాయి.

Thanks for reading Vaccine distribution from 16th January

No comments:

Post a Comment