Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 24, 2021

Find out how easily Aadhaar has been used in the last 6 months ..!


 గత 6 నెలల్లో ఆధార్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఇలా సులభంగా తెలుసుకోండి .. !


ఆధార్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయింది. దాంతో మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు.. ఇంకా అనేక అవసరాలకు ఆధార్ ఉపయోగపడుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు కచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి. అలా ఉంటేనే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అయితే గత 6 నెలల కాలంలో ఆధార్‌ను ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో తెలుసుకునే సదుపాయాన్ని కూడా యూఐడీఏఐ అందిస్తోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ముందుగా ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌ను ఓపెన్ చేయాలి.

https://resident.uidai.gov.in/aadhaar-auth-history

2. అందులో ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

3. ఫొటోలో ఇచ్చిన విధంగా సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయాలి.


4. జనరేట్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయాలి.


5. రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.


6. అక్కడ కనిపించే పేజీలో ఎన్ని లావాదేవీలు చూడాలనుకుంటున్నారు, ఎంత వ్యవధిలోని లావాదేవీలను చూడాలనుకుంటున్నారు.. అనే వివరాలను తెలియజేయాలి.


7. అనంతరం ఓటీపీని ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.


8. తేదీ, సమయం, ఆధార్ ఆథెంటికేషన్ రిక్వెస్ట్ లు తెరపై ప్రత్యక్షం అవుతాయి.


ఇలా ఆధార్‌ను గత 6 నెలల సమయంలో ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించారో సులభంగా తెలుసుకోవచ్చు. దీని వల్ల మన ఆధార్ కార్డులను మనం కాకుండా ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా, లేదా.. అనే వివరాలు తెలుస్తాయి. దాంతో జాగ్రత్తగా ఉండవచ్చు.

https://resident.uidai.gov.in/aadhaar-auth-history

Thanks for reading Find out how easily Aadhaar has been used in the last 6 months ..!

No comments:

Post a Comment