Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 12, 2021

Linked PAN card to Aadhaar card? This is the last date .. ..


ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేసుకున్నారా ? చివరి తేదీ ఇదే ..

 Aadhar Number Link With Pan Card: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? అయితే వెంటనే చేసుకోండి. లేకపోతే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది. గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం చేయకపోతే వినియోగదారుడి పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పాన్ కార్డుతో పాటు ఆధార్ నంబరును పేర్కోనడం తప్పనిసరి. దీంతో పాన్ కార్డుకు ఆధార్ నంబర్‏ను అనుసంధానం చేయడానికి గడువు 31 మార్చి 2021 వరకు ఉంది. ఈ గడువులోపు పాన్ కార్డుకు ఆధార్ నంబర్‏ను లింక్ చేసుకోకపోతే 1 ఏప్రిల్ 2021 నాటికి పాన్ కార్డు రద్దవుతుంది.

కేంద్రం ఇచ్చిన గడువులోపల పాన్, ఆధార్ అనుసంధానం చేసినట్లయితే.. ఆధార్ నంబర్ మీదుగా ఒక రశీదు తేదీ నుంచి పాన్ అమలులోకి వస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించేటప్పుడు ఆధార్ నంబర్ మరియు పాన్, ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఆధార్, పాన్ లింక్ చేయకుండా ఐటీఆర్‏ను దాఖలు చేయలేరు. ఒక వేళ మీరు ఇప్పటికీ ఆధార్, పాన్ అనుసంధానం చేయకపోతే.. ఇలా చేయండి.


ఇందుకోసం ఆదాయపు పన్ను ఇఫైలింగ్ సైట్‏కు సైన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్లో ఆధార్ నంబరును పాన్ కార్డుతో లింక్ చేయాలి. ఆదాయపు పన్ను పోర్ట‏ల్‏లో పాన్, ఆధార్ లింక్ చేయడానికి రెండు మార్గాలున్నాయి.


పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‏ను ఆన్‏లైన్‏లో లింక్ చేయడం..

☞ మొదటిగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.

☞ ఆ తర్వాత తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.

☞ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

☞ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.


ఇలాకాకుండా ఆదాయపు పన్ను పోర్టల్‏లో మీరు నమోదు చేస్తే పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం.

☞ యూజర్ ఐడి, పాస్ వర్డ్ మరియు పుట్టిన తేదీలను ఎంటర్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఇఫైలింగ్ పోర్టల్‏కు లాగిన్ అవ్వచ్చు.

☞ తర్వాత ఆదాయపన్ను పోర్టల్ ఓపెన్ చేసి.. పాప్ అప్ స్క్రీన్ కనిపిస్తుంది. దానిపై మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేయమని చూపిస్తుంది.

☞ పాప్ అప్ స్క్రీన్ కనిపించకపోతే పైన ఉన్న బ్లూ కలర్ ప్రోఫైల్ సెట్టింగులను సెలక్ట్ చేసి.. లింక్ ఆధార్ అని క్లిక్ చేయాలి.

☞ రిజిస్ట్రేషన్ సమయంలో ఇఫైలింగ్ పోర్టల్ కు సమర్పించిన పేరు, పుట్టిన తేదీ మరియు జెండర్ వంటి వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను ఎంటర్ చేయాలి.

☞ అనంతరం మీ ఆధార్ కార్డు నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేసి అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ అంతే మీ ఆధార్ నంబర్ పాన్ కార్డుకు లింక్ చేయబడుతుంది.


ఆదాయపు పన్ను పోర్టల్లో మీ పేరు నమోదు కాకపోతే.. పాన్ కార్డుకు ఆధార్ నంబరును లింక్ చేయడం.

www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి.. లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్న విధంగా పాన్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి వివరాలను ఎంటర్ చేయాలి.

☞ మీ ఆధార్ వివరాలలోతోపాటు పుట్టిన తేదీ కూడా ఉంటే ఐ హవ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

☞ అనంతరం మీకు కనిపిస్తున్న కాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

☞ అంతే ఆధార్ కార్డుకు పాన్ లింక్ అవతుంది.


SMS ద్వారా ఆధార్ నంబరును పాన్ కార్డుకు లింక్ చేయడం..

SMS పంపడం ద్వారా మీరు మీ పాన్ మరియు ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లేదా యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్)కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. అలా చేయడానికి UIDPANఅని టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయాలి. ఇందుకు మొబైల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

Thanks for reading Linked PAN card to Aadhaar card? This is the last date .. ..

No comments:

Post a Comment