Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, February 24, 2021

Manabadi- Nadu:Nedu review by CM Jagan. The CBSE policy will be implemented from class one to class seven this year


 మన బడి నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాదే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 7 వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మన బడి నాడు-నేడుపై సమీక్షించిన ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నాటికి పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానంలోకి తేవాలని స్పష్టం చేశారు. విద్యాకానుక కిట్‌లో ఆంగ్లం-తెలుగు శబ్దకోశం చేర్చాలన్నారు. పాఠ్యపుస్తకాల నాణ్యత కూడా బాగుండాలన్న సీఎం... ప్రైవేట్‌ పాఠశాలల పుస్తకాల నాణ్యతకు పోటీగా ఉండాలని తెలిపారు. విద్యాకానుకలోని ప్రతి వస్తువు నాణ్యంగా ఉండాలని...ఎక్కడా కూడా రాజీ పడొద్దన్నారు. టీచర్లకు కూడా డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మ ఒడి కింద ఆప్షన్‌ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల్లో క్వాలిటీ, సర్వీస్‌ ముఖ్యమని స్పష్టం చేశారు. నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు మార్చిన స్కూల్స్‌ ఫొటోలను సీఎం పరిశీలించారు.మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా మంచి డిజైన్లతో ఉండాలి. స్కూళ్లలో ఇంటీరియర్‌ కూడా బాగుండాలి. రెండో దశలో మరిన్ని మార్పులు చేయాలి. విద్యార్ధులకు ఏర్పాటుచేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలి. పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపం రాకూడదు. నాణ్యతకే పెద్దపీట వేయాలి. కమిటెడ్‌గా పని చేయాలి.. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం'- ముఖ్యంత్రి జగ్మనోహన్ రెడ్డి

పాఠశాలల్లోని టేబుల్స్‌ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సీఎం అన్నారు. టేబుల్స్‌ హైట్‌ కూడా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థితి ఎక్కడా ఉండకూడదని సూచించారు. ఎక్కడైతే భవనాలు లేవో.. అక్కడ కచ్చితంగా కట్టించాలని తెలిపారు. నాడు – నేడులో భాగంగా ఆ పాఠశాలలన్నింటికీ భవన నిర్మాణాలు శరవేగంగా జరగాలని స్పష్టం చేశారు.

Thanks for reading Manabadi- Nadu:Nedu review by CM Jagan. The CBSE policy will be implemented from class one to class seven this year

No comments:

Post a Comment