Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 17, 2021

How CBSE in Government Schools!


సర్కారు బడిలో సీబీఎస్‌ఈ ఎలా!


◆సాధ్యాసాధ్యాలపై సర్వత్రా చర్చ

◆ప్రైవేటు పాఠశాలలూ మారాల్సిందేనా?

◆ఉపాధ్యాయులకు నూతన పద్ధతుల్లో బోధనపై శిక్షణ అవసరం

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ సీబీఎస్‌ఈకి అనుబంధంగా మార్పు చెందుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అనుమతులు, పాఠ్యప్రణాళిక... ప్రైవేటు పాఠశాలల పరిస్థితి ఏమిటి తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. నిర్దేశించిన ప్రమాణాల కనుగుణంగా గుర్తింపు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న పాఠశాలలు 25వేలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా గుర్తింపు లభిస్తే ఆ జాబితాలో అదనంగా 44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఒక్క మన రాష్ట్రం నుంచే కొత్తగా చేరే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు లభించాలంటే గ్రామీణంలో రెండు ఎకరాలు, 15 లక్షల జనాభా మించిన కార్పొరేషన్లలో ఎకరం, మెట్రో నగరాల్లో అర ఎకరం భూమి తప్పనిసరి. ప్రత్యేక పరిస్థితుల్లో రెండెకరాలను 1.5 ఎకరాలకు తగ్గించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ స్థాయిలో భూమి లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతుల వరకూ రెండు, మూడు గదులే ఉంటున్నాయి. చాలా చోట్ల ఏకోపాధ్యాయులే ఉంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవీ అరకొరగానే ఉంటున్నాయి.


సన్నద్ధం చేయాలి

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) తరగతుల వారీగా అభ్యాసన ఫలితాలను నిర్ణయిస్తుంది. ఆ స్థాయి ఉన్న ఏ పబ్లిషర్ల పుస్తకాలైనా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర పాఠ్య ప్రణాళికతో పోల్చితే సీబీఎస్‌ఈ గణితం మినహా మిగతా సబ్జెక్టులు కొంచెం కఠినంగా ఉంటాయి. ఆ స్థాయిలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు ఇప్పటివరకు అనుభవం, శిక్షణ లేదు. వచ్చే ఏడాది నుంచే పాఠ్యప్రణాళిక మార్పు చెందితే ఆ మేరకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. బీఈడీ, డీఈడీ పాఠ్య ప్రణాళికలను మార్పు చేసి ఎన్‌సీఈఆర్టీకి అనుగుణంగా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బోధన పద్ధతులను నేర్చుకునేందుకు మూడేళ్ల వరకు సమయం పడుతోందని కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.


రాష్ట్ర బోర్డుల పరిస్థితి ఏంటి?

ప్రభుత్వం ప్రకటించినట్లు వచ్చే ఏడాది 1-8 తరగతులు, ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి సీబీఎస్‌ఈ గుర్తింపు మార్చుకుంటూ వెళ్తే రానున్న మూడేళ్లలో పదికి అనుమతి లభిస్తుంది. అప్పుడు ఎస్‌ఎస్‌సీ బోర్డు, మరో రెండేళ్లకు ఇంటర్‌ విద్యామండలి ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ప్రస్తుతం పదో తరగతి వరకు సీబీఎస్‌ఈ చదివిస్తున్న తల్లిదండ్రులు ఎంసెట్‌, ఇతర పోటీ పరీక్షల కోసం రాష్ట్ర సిలబస్‌లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చాలా వాటిల్లో శాశ్వత అధ్యాపకులు లేరు. ఒప్పంద సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. కేంద్ర బోర్డు అనుమతికి వెళ్తే పోస్టులన్నీ భర్తీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు కొత్తవి ప్రవేశ పెట్టాల్సి వస్తుంది.


ప్రైవేటు ఎటు వైపు..

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా సీబీఎస్‌ఈలోకి మారాలా? లేదా? అనే దానిపైనా సందిగ్ధత నెలకొంది. ఒకవేళ బోర్డులను కొనసాగిస్తే కేవలం ప్రైవేటు వాటి కోసమే నిర్వహించాల్సి వస్తుంది.  గుర్తింపు పొందాలంటే నిర్దేశించిన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. చాలా యాజమాన్యాలు అంత మొత్తం వెచ్చించే పరిస్థితిలో లేవు. గ్రామీణ ప్రాంతాల్లోని కనీస మౌలికసదుపాయాలు ఉండడం లేదు. జూనియర్‌ కళాశాలలు చాలా వరకు రేకుల షెడ్లలోనే కొనసాగుతున్నాయి. పట్టణాల్లో చాలా వాటికి ఆట స్థలం లేదు. ఒకవేళ గుర్తింపు కోసం వెళ్లాల్సి వస్తే చాలావరకు మూతపడతాయి. విద్యా సంస్థలకు రాష్ట్ర బోర్డులు ఇచ్చిన అనుమతులు కొన్నింటికి ఐదేళ్ల వరకు ఉన్నాయి. ఇవి కొనసాగుతాయా? రద్దవుతాయా? అనే దానిపైనా పలు యాజమాన్యాల్లో ఉత్కంఠ నెలకొంది.

Thanks for reading How CBSE in Government Schools!

No comments:

Post a Comment