Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 8, 2021

SBI Apprentice 2021: Alert for Apprentice Candidates in SBI ... Admit Card Always


 SBI Apprentice 2021 : ఎస్బీఐలో అప్రెంటీస్ అభ్యర్థులకు అలర్ట్ ... అడ్మిట్ కార్డ్ ఎప్పుడంటే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 8500 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణకు 460, ఆంధ్రప్రదేశ్‌కు 620 పోస్టుల్ని కేటాయించింది ఎస్‌బీఐ. రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తుంది ఎస్‌బీఐ. జనవరిలోనే పరీక్షలు జరగాల్సింది. కానీ పరిపాలనాపరమైన కారణాల వల్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇంకా రిలీజ్ కాలేదు. అప్రెంటీస్ పోస్టులకు పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మార్చి చివరి వారంలో రిలీజ్ చేయనుంది ఎస్‌బీఐ. ఏప్రిల్ మొదటివారం లేదా రెండోవారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధంగా ఉండాలి. అడ్మిట్ కార్డుల వివరాల కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్స్ https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/web/careers ఫాలో కావాలి. ఇదే వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయొచ్చు.SBI Apprentice Recruitment 2021: ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే

ఎస్‌బీఐ 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు నిర్వహించనుంది. ఇందులో మొదటిది రాత పరీక్ష. 100 మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటాయి. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ టాపిక్స్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంగ్లీష్‌పై 25 ప్రశ్నలకు 25 మార్కులు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 15 నిమిషాల చొప్పున పరీక్ష 60 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటాయి. నెగిటీవ్ మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతీ తప్పు సమాధానానికి పావు మార్కును తగ్గిస్తారు. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గుతుంది.ఎస్‌బీఐ అప్రెంటీస్ పోస్టులకు నిర్వహించే రాతపరీక్షలో క్వాలిఫై కావడానికి కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 5% సడలింపు ఉంటుంది. మినిమమ్ క్వాలిఫయింగ్ మార్క్స్‌ను బ్యాంకు నిర్ణయిస్తుంది. రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఇవే అంశాలపై లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్ పాస్ అయితేనే అప్రెంటీస్ అవకాశం ఉంటుంది. తుది నియామకం ముందు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

Thanks for reading SBI Apprentice 2021: Alert for Apprentice Candidates in SBI ... Admit Card Always

No comments:

Post a Comment