Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, April 18, 2021

Corona Second Wave... New Symptoms


 కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం .. కొత్త లక్షణాలివే ..

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. మొన్న మొన్నటివరకు పెద్దగా కేసులు నమోదు కాలేదు. అలాంటిది ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోయాయి. మొదటి వేవ్ కంటే ఎక్కువగా కేసులు వస్తున్నాయి. ఒక్కరోజులో రెండు లక్షలకి పైగా కేసులు నమోదవుతుండడం జనాల్లో భయాన్ని కలిగిస్తుంది. మళ్ళీ లాక్డౌన్ దిశగా సాగుతుందంటూ పుకార్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించట్లేదని, లాక్డౌన్ పెట్టే సమస్యే లేదని ప్రభుత్వం ప్రకటించేసింది.


ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ కరోనా నుండి కాపాడుకోవాలనీ, చేతులు కడుక్కోవడం, గుంపుల్లో తిరగకపోవడం, మాస్క్ ధరించడం వంటివి పాటించాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ల్ఫ్ కరోనా వ్యాధి లక్షణాలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయని తెలుస్తుంది.

జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతు మంట మాత్రమే కాకుండా మరికొన్ని కొత్త లక్షణాలు వస్తున్నాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.


నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు ఇలా ఉన్నాయి. నాలుక రుచి కోల్పోవడం, నోట్లో పొక్కులు, నోరు పొడిబారిపోవడం, లాలాజలం ఊరకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇంకా నీళ్ళు తాగినా, అన్నం తిన్నా గొంతులో మంటగా ఉంటుందట. పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరుని సంప్రదించాలని కోరుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. 25ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలనే వాదన బలంగా వినిపిస్తుంది. మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

Thanks for reading Corona Second Wave... New Symptoms

No comments:

Post a Comment