Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, April 23, 2021

Covid Vaccine Update: Pricing, Registration, Side Effects - Answers to All Questions


 కోవిడ్ వ్యాక్సిన్ అప్డేట్ : ధర , రిజిస్ట్రేషన్ , సైడ్ ఎఫెక్ట్స్ - అన్ని ప్రశ్నలకు సమాధానాలు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏప్రిల్ 28వ తేదీ నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ఎస్ శర్మ గురువారం(ఏప్రిల్ 22) ఒక ప్రకటన చేశారు.

వ్యాక్సినేషన్‌లో కోవాగ్జిన్,కోవీషీల్డ్‌తో పాటు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను కూడా కొన్ని హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వీలైనన్ని ఎక్కువ హెల్త్ కేర్ సెంటర్స్,ప్రైవేట్ ఆస్పత్రుల ద్వారా విస్తృత వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.వ్యాక్సినేషన్ తర్వాత ఏదైనా దుష్ప్రభావం కనిపిస్తే వైద్యుల పర్యవేక్షణలో ఉంటుందన్నారు.


1.మూడవ దశ వ్యాక్సినేషన్‌ ఎవరు తీసుకోవచ్చు..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.


2.మే 1వ తేదీ నుంచి ఎలాంటి మార్పులు ఉంటాయి..?

వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌లో.. 50శాతం నేరుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,ప్రైవేట్ కంపెనీలకు విక్రయించనున్నాయి. మిగతా 50శాతం కేంద్రానికి విక్రయిస్తారు.


3.వ్యాక్సిన్ అందరికీ ఉచితంగా ఉంటుందా..?

హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకా ఇస్తుంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 45 ఏళ్లు పైబడిన వారు రూ. 250 చెల్లించి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్, అస్సాం,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, సిక్కిం, బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలు మే 1 నుంచి అందరికీ ఉచితంగా టీకాను సరఫరా చేస్తామని చెప్పాయి.


4.కోవిషీల్డ్ టీకా ధర ఎంత..?

కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 చొప్పున విక్రయించనున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది.


5.కోవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాల్లో ఏది బాగుంటుంది..?

రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. రెండిటిని పోల్చలేము. రెండు టీకాలు కరోనా కట్టడికే అభివృద్ధి చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు సీనియర్ సిటిజెన్లు టీకా తప్పనిసరిగా తీసుకోవాలి.


6.కోవిడ్ వ్యాక్సిన్‌కు ఎప్పుడు నమోదు చేసుకోవాలి..?

కోవిన్ యాప్‌ ద్వారా ఏప్రిల్ 28వ తేదీ నుంచి టీకా కోసం నమోదు చేసుకోవచ్చు.


7.సొంతంగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి...?

మొదట cowin.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ అవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.మీ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి.ఆ తర్వాత 'రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సిన్' పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫోటో ఐడీ ప్రూఫ్,ఇతరత్రా వివరాలు నమోదు చేయాలి. మీకేమైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే... ఆ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి వైపున ఉన్న 'రిజిస్టర్' ఆప్షన్‌ని క్లిక్ చేయాలి.ఆ తర్వాత మీ సెల్‌ఫోన్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక... మీ అకౌంట్ వివరాలన్నీ ఆ పేజీలో కనిపిస్తాయి. 'షెడ్యూల్ అపాయింట్‌మెంట్' అనే ఆప్షన్ ద్వారా మీ అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఒకే మొబైల్ నంబర్‌పై మరో ముగ్గురిని కూడా యాడ్ చేయవచ్చు. ఇందుకోసం యాడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది.


8.రెండో డోసు కోసం మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందా..?

అవసరం లేదు. తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలో మెసేజ్ రూపంలో వస్తుంది.


9.రిజిస్ట్రేషన్ సమయంలో ఫోటో ఐడీ అవసరం పడుతుందా..?

రిజిస్ట్రేషన్ సమయంలో ఫోటో ఐడీ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సమయంలో కూడా చూపించాల్సి ఉంటుంది


10.రెండు టీకాల్లో నాకు నచ్చిన టీకాను తీసుకునే వీలుంటుందా..?

అలా లేదు. టీకా కేంద్రంలో ఏ టీకా అందుబాటులో ఉంటే ఆ టీకాను ఇవ్వడం జరుగుతుంది.


11.మెడికల్ స్టోర్లలో ఫార్మసీలో టీకాలు అందుబాటులో ఉంటాయా..?

ప్రస్తుతం అత్యవసర పద్దతిన ఇస్తున్నందున బహిరంగ మార్కెట్లలో అమ్మడానికి అనుమతి లేదు.


12.కోవిడ్ -19 చికిత్సలో రెమ్‌డెసివిర్ అద్భుతంగా పనిచేస్తుందా..?

రెమ్‌డెసివిర్ అనేది అద్భుతం చేయదు అదే సమయంలో మరణాల శాతం కూడా నిలువరించదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి


13.వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరా..?

టీకా తీసుకోవాలనేది తప్పనిసరి కాదు. ఎవరి ఇష్టం మేరకు వారు తీసుకోవచ్చు. కానీ ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే టీకా తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.


14.వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, ఇంజెక్షన్ ఇచ్చిన చోట ఎర్రగా మారడంలాంటివి కనిపిస్తే ఒక పారాసిటామాల్ తీసుకుంటే రెండు మూడు రోజుల్లో నయం అవుతుంది


15.గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు పాలు పట్టే తల్లులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు టీకా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు


16.హార్ట్ పేషెంట్ టీకా తీసుకోవచ్చా..?

తీసుకోవచ్చు


17.వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..?

రెండు వ్యాక్సిన్‌లు సురక్షితం. ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ డోసులు ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ స్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదయ్యాయి.


18.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం అవసరమా..?

మాస్కు తప్పనిసరిగా ధరించాలి. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పక పాటించాలి.


19.టీకా తీసుకున్న తర్వాత ఎంతమందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది..?

ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొవాగ్జిన్ టీకా రెండో డోసు తర్వాత 0.04శాతం కేసులు పాజిటివ్‌ రాగా కొవిషీల్డ్ టీకా తీసుకున్నాక 0.03శాతం మందికి పాజిటివ్ వచ్చింది.


20.కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చే అవకాశాలున్నాయా?

టీకా తీసుకున్నాక శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు రెండు వారాల సమయం పడుతుంది.ఈ లోగ టీకా తీసుకున్న వ్యక్తి కరోనా బారిన పడే అవకాశం ఉంది.


21.రెండో డోసు తీసుకోకుంటే పరిస్థితేంటి..?

టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నెలల తర్వాతైనా రెండో డోసు తీసుకోవచ్చు. అది తీసుకోకపోతే రెండు నెలల తర్వాత యాంటీబాడీ టెస్టు చేయించుకుంటే రోగనిరోధక శక్తి పై ఒక స్పష్టత వస్తుంది


22.కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో ఎంతకాలం ఇది పనిచేస్తుంది...?

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిలో టీకా ఎంతకాలం పనిచేస్తుందనే దానిపై స్పష్టత లేదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.


23.టీకా తీసుకుంటే కొత్త స్ట్రెయిన్స్ మ్యూటేటెడ్ వైరస్‌ నుంచి రక్షణ ఉంటుందా..?

టీకా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీలు తయారై వైరస్‌తో పోరాడుతాయి. కాబట్టి అన్ని వ్యాక్సిన్‌లు బాగా పనిచేస్తాయి.


24.వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది..?

కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్న 2-3 వారాలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


25.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మద్యంకు దూరంగా ఉండాలా..?

వ్యాక్సిన్ పై మద్యం ప్రభావం చూపుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు.


26.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి..?

రెండు టీకాలు సురక్షితమైనవే. అయితే ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి వైద్యుడికి చూపించుకోవడం కానీ, కోవిన్ యాప్‌లో మీకు వ్యాక్సిన్ ఇచ్చిన హెల్త్ వర్కర్ ఫోన్ నెంబర్‌ ఉంటుంది . ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.


27.తొలి డోసుగా ఏ టీకా అయితే తీసుకున్నానో రెండో డోసు కూడా అదే కంపెనీ టీకా తీసుకోవాల్సిందేనా..?

తొలి డోసుగా ఏ కంపెనీ టీకా అయితే తీసుకున్నావో రెండో డోసుగా కూడా అదే కంపెనీ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే వ్యాక్సిన్ ఇచ్చేలా కోవిన్ యాప్ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్త పరుస్తుంది.

Thanks for reading Covid Vaccine Update: Pricing, Registration, Side Effects - Answers to All Questions

No comments:

Post a Comment