Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 22, 2021

How To Improve Oxygen Levels


 COVID - 19 Oxygen Levels : ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకునేందుకు ఈ చిట్కా పాటించండి , బీ అలర్ట్

How To Improve Oxygen Levels | కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు



దిల్లీ: కరోనా వైరస్‌ రెండో విజృంభణతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో మెడికల్‌ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ సోకిన వారికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే శ్వాస సమస్యలను అధిగమించొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా 'ప్రోనింగ్‌' (ప్రత్యేకమైన పొజిషన్‌లలో పడుకొని ఊపిరి తీసుకోవడం) వల్ల శ్వాసతో పాటు ఆక్సిజన్‌ స్థాయులను మెరుగుపరచుకోవచ్చని చెబుతోంది.


ఛాతి, పొట్టభాగంపై బరువుపడే విధంగా (ñబోర్లా) పడుకోవడం లేదా ఒక పక్కకు పడుకొని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ చేరుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

 'ప్రోనింగ్‌'గా పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని పేర్కొంది. ముఖ్యంగా ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు 'ప్రోనింగ్‌' ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.


'ప్రోనింగ్‌' ద్వారా శ్వాస తీసుకునే విధానం


* మొదట మంచంపై బోర్లా పడుకోవాలి.


* ఒక మెత్తటి దిండు తీసుకుని మెడ కిందభాగంలో ఉంచాలి.


* ఛాతి నుంచి తొడ వరకూ ఒకటి లేదా రెండు దిండ్లను ఉంచవచ్చు.


* మరో రెండు దిండ్లను మోకాలి కింద భాగంలో ఉండేలా చూసుకోవాలి. (పై చిత్రంలో చూపిన విధంగా)


ఇక ఎక్కువ సమయం పడకపై ఉండే రోగులకు రోజంతా ఒకేవిధంగా కాకుండా పలు భంగిమల్లో విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఒక్కో స్థానంలో 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవచ్చు. (కింది చిత్రాల్లో చూడొచ్చు)




తీసుకోవాల్సిన జాగ్రత్తలు..


* భోజనం చేసిన తర్వాత గంట వరకు ప్రోనింగ్‌ చేయవద్దు.


* తేలికగా, సౌకర్యవంతంగా అనిపించినంత వరకు మాత్రమే ప్రోనింగ్‌ చేయండి.


* పలు సమయాల్లో రోజులో గరిష్ఠంగా 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.(వైద్యుల సూచనల మేరకు)


* హృద్రోగ సమస్యలు, గర్భిణిలు, వెన్నెముక సమస్యలున్నవారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.


* ప్రోనింగ్‌ సమయంలో దిండ్లను సౌకర్యవంతంగా ఉండేలా ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.


ప్రయోజనాలు..


* ప్రోనింగ్‌ పొజిషన్‌ వల్ల శ్వాసమార్గం సరళతరమై గాలి ప్రసరణ మెరుగవుతుంది.


* ఆక్సిజన్‌ స్థాయులు 94శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ప్రోనింగ్‌ అవసరం.


* ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ స్థాయులు, రక్తంలో చక్కెర స్థాయులను పరిశీలించడం ఎంతో ముఖ్యం.


* మంచి వెంటిలేషన్‌, సకాలంలో 'ప్రోనింగ్‌' చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇక సాధారణ పద్ధతిలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచేందుకు ప్రోనింగ్‌ సురక్షిత పద్ధతేనని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అవసరం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఐసోలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగులకు ప్రోనింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రోనింగ్‌ గురించి మీ దగ్గరిలో ఉన్న వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలి. మీ శరీరం అందుకు సహకరిస్తుందా? లేదా? అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.


మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి సాధారంగా 94 లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లే అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులు, సంబంధిత సమస్య ఉన్న వారిలో ఆక్సిజన్ స్థాయి 88-92 వరకు ఉంటుంది. అయితే ఆక్సిజన్ స్థాయి పెంచుకునేందుకు ఓ చిన్న చిట్కాను పాటిస్తే సరి అని తెలుస్తోంది. ఓ .ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు బోర్లా పడుకుని శ్వాస గట్టిగా తీసుకుంటే మీ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న ప్రారంభ దశలోనే ఇలాంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది. శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జ్యోతి మట్టా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. బోర్లా పడుకుని(Prone position) లేదా మీ ఉదరభాగం నేలకు తాకించి నిద్రించే స్థితిలో ఉండి గట్టిగా శ్వాస తీసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయని, ఇది కోవిడ్19(COVID-19) బాధితులకు మేలు చేస్తుందన్నారు.


ప్రతి ఒక్కరికి, ప్రతి దశలో కరోనా బాధితులకు ఇది పనిచేస్తుందని మాత్రం చెప్పలేమన్నారు. ఆక్సిజన్ స్థాయి అప్పుడే తగ్గుతున్న వారు, లేదా ఆక్సిజన్ లెవెల్ పెంచుకోవాలనుకునే వారిలో అధిక శాతం ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఆక్సిజన్ స్థాయిలు 94కి తగ్గిపోతున్నట్లు గమనిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వారి సూచిన మేరకు కరోనా నిర్ధారణ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.

Thanks for reading How To Improve Oxygen Levels

No comments:

Post a Comment