Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 22, 2021

Registration process on the Cowin Portal.


 18 ఏళ్లు పైబడినవారికి .. 28 నుంచి రిజిస్ట్రేషన్

దిల్లీ: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా టీకా కార్యక్రమం పరిధిలోకి కేంద్రం 18ఏళ్లు పైబడిన వారిని కూడా తీసుకువచ్చింది. రిజిస్టేషన్ పై ప్రభుత్వం క్లారిటీ .. APR 28 ఫిక్స్ . దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి .. మే 1 నుంచి వ్యాక్సిన్ వేయనున్నారు .. దానిపై స్పందించిన కేంద్రం .. APR 28 నుంచే కొవిన్ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని , టీకా పంపిణీకి 48 గంటల ముందు మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది .  టీకా కోసం ఆరోగ్య సేతు యాప్ లోనూ రిజిస్టర్ అవ్వొచ్చు .మే ఒకటి నుంచి వారికి టీకాలు పంపిణీ చేయనుంది. దానిలో భాగంగా "18ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్‌ 28 బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.


దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చి..రికార్డు స్థాయిలో కొత్త కేసుల నమోదుకు కారణం అవుతోంది. ఈ లెక్కతో రోజూవారీ కేసుల్లో భారత్ అమెరికాను దాటి కలవరపెట్టిస్తోంది. దాంతో 18ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకాలు అందించేందుకు కేంద్రం ఇటీవల నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం నడుస్తోన్న టీకా దశలు కొనసాగుతాయని తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం వాడుతోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.


కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..

⇒ మొదట కొవిన్ పోర్టల్‌(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.


⇒ ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్‌ ఓపెన్ అవుతోంది.


⇒ దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.

⇒ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.


⇒ పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.

Thanks for reading Registration process on the Cowin Portal.

No comments:

Post a Comment