Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 19, 2021

Jagananna Vidya Deevena begins .. Cash in mothers' accounts!


జగనన్న విద్యా దీవెన ప్రారంభం .. తల్లుల ఖాతాల్లోకే నగదు !

 జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన గొప్ప కార్యక్రమమని సీఎం జగన్​ అన్నారు. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు.

జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ఏ త్రైమాసికానికి... ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నేడు 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671.45 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.


చదువుతోనే పేదరికం నుంచి బయటపడతాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నాం. 2018-19కి సంబంధించి రూ.1880 కోట్లు బకాయిలు చెల్లించాం. 2019-20కి సంబంధించి రూ.4208 కోట్లు గతేడాది చెల్లించాం. పిల్లల చదువులను ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటోంది. ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే నిధులు విడుదల చేస్తాం. 1902కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. కళాశాల యాజమాన్యాలలోనూ జవాబుదారీతనం పెరగాలి. ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నాం- సీఎం జగన్


జగనన్న విద్యాదీవెన మొదటి విడత నేడు, రెండో విడత జులై, మూడో విడత డిసెంబర్, నాలుగో విడత ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం విడుదల చేయనుంది. జగనన్న వసతిదీవెన కింద రెండు విడతల్లో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలకు ఏటా 20,000 వరకు లబ్ధి చేకూర్చుతుంది. మొదటి విడత ఏప్రిల్‌ 28, రెండో విడత డిసెంబర్​లో నిధులు చెల్లిస్తారు. ఈ ఏడాది మొదటి విడతగా 671.45 కోట్లు నేడు చెల్లించడం ద్వారా... 10 లక్షల 88వేల 439 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది.


JAGANANNA VIDYA DEVENA 2020 - 21 ELIGIBLE LIST click here

 

Thanks for reading Jagananna Vidya Deevena begins .. Cash in mothers' accounts!

No comments:

Post a Comment