Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, April 15, 2021

Money Transfer: Accidentally transferred money to a different account? Do this


 Money Transfer : పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారా ? ఇలా చేయండి

మీరు తరచూ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? ఎప్పుడైనా పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలాంటి సమస్య చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? డబ్బులు వెనక్కి వచ్చేలా ఏ చర్యలు తీసుకోవాలి? అన్న ఆలోచన వెంటనే రాదు. ముందు టెన్షన్ పడతారు. డబ్బులు పోయాయి కదా అని కంగారు పడతారు. ఇలా పొరపాటున డబ్బులు ఇతరుల అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసినంత మాత్రానా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలు అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా మనీ ట్రాన్స్‌ఫర్ కోసం యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాంటి టెక్నాలజీ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మరి పొరపాటును ఇతరుల అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎలా డబ్బులు వెనక్కి తెప్పించుకోవాలో తెలుసుకోండి.

ఈ పొరపాటు జరిగిన వెంటనే ముందుగా మీరు బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. కస్టమర్ కేర్‌కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాలి. లావాదేవీ జరిగిన తేదీ, సమయం, మీరు ట్రాన్స్‌ఫర్ చేసిన మొత్తం, మీ అకౌంట్ నెంబర్, ఆ డబ్బులు ఏ అకౌంట్‌లోకి వెళ్లాయి అన్న వివరాలన్నీ వెల్లడించాలి. అప్పుడు బ్యాంకు ప్రతినిధులు మీకు పరిష్కారం సూచిస్తారు. లేదా మీరు దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. మీరు ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్ అసలు ఎవరి పేరు మీదా లేకపోతే మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు ఎక్కడికీ పోవు. ఆటోమెటిక్‌గా మీకు రీఫండ్ అవుతాయి. ఒకవేళ రీఫండ్ కానట్టైతే మేనేజర్‌కు కంప్లైంట్ చేయాలి. అప్పుడు బ్యాంకు మేనేజర్ ఆ లావేదేవీల వివరాలు చెక్ చేస్తారు. ఒకవేళ సేమ్ బ్రాంచ్‌లోనే సదరు వ్యక్తికి అకౌంట్ ఉన్నట్టైతే డబ్బులు తిరిగి ఇవ్వాలని బ్యాంకు కోరుతుంది. ఒకవేళ వేరే బ్రాంచ్‌లో ఉన్న అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయితే మీ డబ్బులు తిరిగి రావడానికి 2 నెలల వరకు సమయం పట్టొచ్చు.


ఒకవేళ డబ్బులు పొందిన వ్యక్తి మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సదరు వ్యక్తి వివరాలు పూర్తిగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI నిబంధనల ప్రకారం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేప్పుడు సరైన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన బాధ్యత మీదే. కానీ పొరపాటున మీరు తప్పుడు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయడం వల్ల ఇతరుల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తే మీరు రీఫండ్ కోసం బ్యాంకు సాయం తీసుకోవచ్చు. అయితే బ్యాంకులు కూడా డబ్బులు పొందిన వ్యక్తి అనుమతి లేకుండా మీకు రీఫండ్ చేయలేవు. బ్యాంకులు కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తాయి.

Thanks for reading Money Transfer: Accidentally transferred money to a different account? Do this

No comments:

Post a Comment