Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, May 15, 2021

Black fungus: Spread with the use of that water!


 Black fungus: ఆ నీటి వాడకంతో వ్యాప్తి!

దిల్లీ: ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు సాధారణ నీటిని హ్యుమిడిఫయర్‌ (తేమ అందించే పరికరం) ద్వారా అందించడం కూడా బ్లాక్‌ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్‌ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్‌ అతుల్‌ అభ్యంకర్‌ మాట్లాడుతూ... ‘‘బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం... ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే. వాటిలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు. అందులో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి కారణంగా శరీరంలో ఫంగస్‌ ఏర్పడుతోంది. 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేయాలి’’ అని సూచించారు.  

కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ ఇస్తున్నారు. వాటి దుష్పభ్రావాల కారణంగా మ్యూకోర్‌మైకోసిస్‌ దాడి చేస్తోంది. కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం చూపుతోంది. గుజరాత్‌లో కొందరు ఆవు పేడను, మూత్రాన్ని శరీరానికి పూసుకొంటున్నారు. ఈ విధానం కారణంగా మ్యుకర్‌మైకోసిస్, ఇతర ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తున్నట్టు నిపుణులు హెచ్చరించారు.

Thanks for reading Black fungus: Spread with the use of that water!

No comments:

Post a Comment