Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 3, 2021

These are immunity boosters.


 ఇమ్యూనిటీ బూస్టర్స్​ ఇవే..

రోగానికి ట్రీట్​మెంట్​ కంటే ఆ రోగం రాకుండా జాగ్రత్తపడటం మేలంటారు. కోవిడ్​కి ముందు జాగ్రత్త ఇంకా ఎక్కువ అవసరం. ఇమ్యూనిటీ మంచిగుంటే కరోనా వైరస్​ ఏమీ చేయలేదని ఇంతకుముందు కోవిడ్​ బారినపడి కోలుకున్నవాళ్లను చూస్తే తెలుస్తూనే ఉంది.  కరోనా వైరస్​ రాకుండా మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో? అంతే జాగ్రత్తగా మంచి ఫుడ్​ తింటూ, అందులో కూడా ఇమ్యూనిటీని పెంచే వాటిని చేర్చుకుంటూ పోతే మంచిదని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. 


సిట్రస్​ ఫ్రూట్స్​


నిమ్మ, నారింజ లాంటిపుల్లని పండ్లలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి రోజులో ఏదో ఒక టైంలో నిమ్మ జాతి పండ్ల నుంచి తీసిన రసం తాగాలి. వేడి నీళ్లలో నిమ్మరసం పిండితే పులుపు ఉంటుంది. కానీ, విటమిన్​–సి ఉండదు. 


వెల్లుల్లి 


బాడీలో ఇమ్యూనిటీని పెంచే ముఖ్యమైన వాటిల్లో వెల్లుల్లి ఒకటి. వైరల్​ ఇన్ఫెక్షన్లు, వాపులు, నొప్పుల లాంటి వాటిని తగ్గించే గుణం వెల్లుల్లికి ఉంది. 


అల్లం 

ఇన్ఫెక్షన్​, వాతావరణ మార్పుల వల్ల వచ్చే గొంతు సమస్యలను తగ్గిస్తుంది. 


ఆకు కూరలు 


ఆకుకూరల్లో విటమిన్​–సి, యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు పుష్కలం. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ముఖ్యంగా పాలకూరలో ఇవి ఎక్కువగా ఉంటాయి. 


బాదం  

బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థ యాక్టివ్​గా ఉండటానికి విటమిన్‌–ఇ  కావాలి. బాదం గింజల్లో విటమిన్‌–ఇ అధికంగా ఉంటుంది. 


గింజలు 


బాడీలో ఇమ్యూన్​ సిస్టమ్​ కంట్రోల్‌కు పొద్దుతిరుగుడు గింజలు, ఇతర గింజలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఫాస్పరస్​ మెగ్నీషియం, విటమిన్‌ – బి6,  విటమిన్​–ఇ ఎక్కువగా ఉంటాయి. 


పసుపు 


ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే గాయాలను మాన్పుతుంది.


గ్రీన్​ టీ 


ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్​ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్​గా బాడీలో ఉపయోగపడతాయి. 


బొప్పాయి 


ఇందులో విటమిన్​– సి పుష్కలంగా ఉంటుంది. దానితోపాటు మెగ్నీషియం, ఫోలేట్​ కూడా ఉంటాయి. ఇవి రోగాల బారినపడిన వాళ్లు త్వరగా కోలుకోవడానికి సాయం చేస్తాయి. 


పెరుగు, బ్రొకోలి


వీటిలో విటమిన్​ – డి ఎక్కువగా ఉంటుంది. మిగతా విటమిన్లు కూడా ఉంటాయి. ఫైబర్​ పుష్కలంగా ఉంటుంది.

Thanks for reading These are immunity boosters.

No comments:

Post a Comment