AP EAPCET 2021 Notification, Online Application Form Registration, Exam Dates @ sche.ap.gov.in
ఏపీ ఈఏపీసెట్-2021 నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తుల స్వీకరణ ప్రారంభo.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్–2021కు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. ఈ మేరకు కాకినాడ జేఎన్టీయూ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయో పరిమితి, సిలబస్, దరఖాస్తు చేసే విధానం తదితర వివరాలకు క్రింద ఇవబడ్డ వెబ్సైట్ ను సందర్శించాలి.
కోర్సులు
1.ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
2.బీఎస్సీ(అగ్రి), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్‌ఎస్సీ
3.బీఫార్మసీ, ఫార్మాడీ
దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజు
► ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500
► అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షకు.. ఓసీలకు రూ.600, బీసీలకు రూ.550, ఎస్సీ, ఎస్టీలకు రూ.500
► రెండింటికీ కలిపి హాజరయ్యేవారికి.. ఓసీలకు రూ.1,200, బీసీలకు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,000
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు
► ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 నుంచి జూలై 25 వరకు
► ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5 వరకు, రూ.1000తో ఆగస్టు 10 వరకు, రూ.5 వేలతో ఆగస్టు 16 వరకు, రూ.10 వేలతో ఆగస్టు 18 వరకు
► హాల్ టికెట్లను ఆగస్టు 12 నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆగస్టు 19 నుంచి పరీక్షలు
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
► ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు
► మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 గంటల వరకు
Thanks for reading AP EAPCET 2021 Notification, Online Application Form Registration, Exam Dates @ sche.ap.gov.in
No comments:
Post a Comment