Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 2, 2021

Covid Third Wave: The risk of corona third wave is high in children .. These are the foods that boost the immunity in your children ...


Covid Third Wave : కరోనా థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకే అధికం .. మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే ... నిపుణులు ఏం చెబుతున్నారంటే ..

 Immunity booster: కరోనా రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి ఎంతో మందిని బలితీసుకోవడమే కాకుండా.. చాలా కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలోనే.. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు రాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిన్నారులకు ఎలాంటి టీకాలు అందుబాటులోకి రాలేదు. దీంతో పిల్లలు ఇప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సరైన పోషకాహారాన్ని అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.


పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేరెడు పండు మంచిది. ఈ పండు కేవలం వేసవి కాలంలో మాత్రమే వస్తుంది.దీనిని పిల్లలకు ఇవ్వడం ద్వారా మంచి గట్ బ్యాక్టీరియాస పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇదే కాకుండా.. పిల్లలకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య పోషకాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. రోటీ, నెయ్యి మరియు బెల్లం రోల్ లేదా సుజీ హల్వా లేదా రాగి లడ్డూ వంటి తీపి ఆహారాన్ని ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు. పిల్లలకు ఎక్కువగా అన్నం తినిపించాలి. ఎందుకంటే బియ్యంలో ప్రత్యేకమైన ఆమ్లం ఉంటుంది. పప్పు, బియ్యం, నెయ్యి కలిసిన ఆహారాన్ని పిల్లలకు అందించడం మంచిది. అలాగే కూరగాయలతో చేసిన పచ్చళ్లు కూడా మంచివే. ఇవి గట్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహయపడుతుంది. అలాగే వారికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహయపడుతుంది. వీటితోపాటు జీడిపప్పు కూడా చాలా మంచిది. ఇది వారికి కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందిస్తోంది.


కేవలం ఆహారం మాత్రమే కాకుండా.. పిల్లలపై ఒత్తిడి ఉండకూడదు. రోజంతా అలసటగా ఉండడం.. ఎప్పుడూ మర్చిపోవడం కూడా మంచిది కాదు. అలాగే వారికి సరిపడినంత నిద్ర ఉండాలి. నిద్ర మంచిగా ఉండడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే ఉబకాయం సమస్య తగ్గుతుంది. అలాగే పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు మాన్పించాలి. వీటిలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి పిల్లలు బరువు పెరగేలా చేస్తాయి. అలాగే శరీరానికి రోగ నిరోధక శక్తిని అందించవు. అలాగే ప్యాకెట్స్ లో ఉండే ఫుడ్ కూడా మంచిది కాదు. పిల్లలు రోజూ ఉత్సాహంగా ఉండేందుకు వారికి వ్యాయమం అలవాటు చేయాలి. వ్యాయమం చేయడం వలన జీవక్రియ పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది.

Thanks for reading Covid Third Wave: The risk of corona third wave is high in children .. These are the foods that boost the immunity in your children ...

No comments:

Post a Comment